శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2023 మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు.

రాత్రి 7.30 గంటల నుండి అంకురార్పణ ఘట్టం ప్రారంభమైంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు.

మే 26న ధ్వజారోహణం :

శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు మే 26వ తేదీ ఉదయం 8.22 నుంచి 8.49 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వ‌హిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.