25 CASES LODGED BY TTD VIG WING IN TWO MONTHS SPAN _ రెండు నెలల వ్యవధిలో ద‌ళారుల‌పై 25 కేస్‌ల న‌మోదు

TIRUMALA, 21 AUGUST 2021: Following the complaints lodged by the Vigilance Wing of TTD, 25 FIRs have been registered and 41 persons were arrested for their alleged connection in black-marketing of darshan tickets.

According to Vigilance Wing officials, in the months of July and August, the Vigilance Wing of TTD has identified Dalaris who are selling the darshan tickets to pilgrims at exorbitant rates. While some persons with the forged letters of public representatives, fake websites and Travel Agencies cheating devotees were also identified.

Complaints have been registered against all these miscreants at different Police Stations at Tirumala and in Tirupati for trying to cheat devotees, encashing with their sentiments.

TTD had multiple times cautioned devotees not to fall prey to Dalaris and approach fake websites and travel agencies for darshan and appealed to them to only book online tickets from TTD official website www.tirupatibalaji.gov.in and has warned the dalaris and fake website and travel agencies of serious legal action if proved guilty.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రెండు నెలల వ్యవధిలో ద‌ళారుల‌పై 25 కేస్‌ల న‌మోదు

తిరుమల, 2021 ఆగస్టు 21: శ్రీ‌వారి దర్శన టిక్కెట్ల బ్లాక్ మార్కెటింగ్‌తో సంబంధం క‌లిగి ఉన్నారనే ఆరోపణలపై టిటిడి నిఘా మ‌రియు భద్రాతా విభాగం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీస్ వారు రెండు నెల‌ల‌లో వ్య‌వ‌ధిలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 41 మందిని అరెస్టు చేశారు.

జూలై మరియు ఆగస్టు నెలల్లో భక్తులకు స్వామివారి దర్శన టిక్కెట్లను అధిక ధరలకు విక్ర‌యిస్తున్న దళారులను టిటిడి విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఇందులో కొంతమంది ప్రజా ప్రతినిధుల నకిలీ లేఖలు, నకిలీ వెబ్‌సైట్లు, ట్రావెల్ ఏజెన్సీలు భక్తులను మోసం చేస్తున్నట్లు గుర్తించడ‌మైన‌ది.

భక్తులను మోసం చేయ‌డానికి ప్రయత్నించినందుకు, వారి మనోభావాలు దెబ్బ‌తిసేలా న‌డుచుకున్న ద‌ళారుల‌పై తిరుమల, తిరుపతిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో టిటిడి విజిలెన్స్ విభాగం అధికారులు ఫిర్యాదులు నమోదు చేశారు.

భక్తులు దళారులను నమ్మొద్దని, దర్శనం కోసం నకిలీ వెబ్‌సైట్‌లు మరియు ట్రావెల్ ఏజెన్సీలను సంప్రదించవద్దని టిటిడి ఇప్పటికే అనేకసార్లు హెచ్చరించింది. టిటిడి అధికారిక వెబ్‌సైట్ www.tirupatibalaji.gov.in నుండి మాత్ర‌మే ఆన్‌లైన్ టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి మ‌రోసారి విజ్ఞప్తి చేస్తున్నది. దళారులు, నకిలీ వెబ్‌సైట్ నిర్వ‌హ‌కులు, ట్రావెల్ ఏజెన్సీలపై నేరం రుజువైతే టిటిడి చట్టపరంగా తీవ్రమైన‌ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తోంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.