GARUDA PANCHAMI GARUDA SEVA HELD _ తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

TIRUMALA, 09 AUGUST 2024: On the auspicious occasion of Garuda Panchami, Sri Malayappa Swamy took out a celestial ride on Garuda Vahanam.
 
The processional deity atop Garuda Vahanam blessed devotees all along four mada streets on Friday evening.
 
Both the Pontiffs of Tirumala, Additional EO Sri Ch Venkaiah Chowdhary, CVSO Sri Sridhar, Temple DyEO Sri Lokanatham and others were also present.
 
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా గరుడ పంచమి

తిరుమల, 2024 ఆగ‌స్టు 09: గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ జరిగింది.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు.

గరుడ వాహనసేవలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, సివి అండ్ ఎస్ ఓ శ్రీ శ్రీధర్, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.