FREE AYURVEDIC MEDICAL CAMP AT K.KOTTAPET _ ఎస్ వి ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో కె.కొత్తపేట గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
ఎస్ వి ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో కె.కొత్తపేట గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
తిరుపతి, 2024 అక్టోబరు 23: తిరుపతి శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో 9వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా మూడో రోజు అయిన బుధవారం చంద్రగిరి మండలం కె.కొత్తపేట గ్రామంలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని నిర్వహించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవం అక్టోబర్ 29వ తేదీ ముగినున్నాయి.
టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, జేఈవో శ్రీమతి గౌతమి ఆదేశాల మేరకు ఆయుర్వేద డాక్టర్లు, పారా ముడికల్ సిబ్బంది కె.కొత్తపేట గ్రామంలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయుర్వేదంపై గ్రామ ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా మందుల పంపిణీ తో పాటు ఆరోగ్య సూత్రాలు, వాటి గురించి అవగాహన, నిత్యజీవితంలో అనుసరించడం ద్వారా కలిగే ఉపయోగాలు, వ్యాధుల నివారణ తదితర అంశాలపై కళాశాల వైద్య నిపుణులు వివరించారు. ఐ సపోర్టు ఆయుర్వేద, క్యూర్ కోడ్ ద్వారా ఆయుర్వేదాన్ని ప్రొత్సహించారు.
ఈ సందర్భంగా కళాశాల మరియు ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రేణు దీక్షిత్ మాట్లాడుతూ, 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని “గ్లోబల్ హెల్త్ కోసం ఆయుర్వేద ఆవిష్కరణ” గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. స్త్రీలకు ఆయుర్వేదం ద్వారా ఆరోగ్య సంక్షేమం, జీవన శైలి, పంచకర్మ చికిత్సలు, విభిన్న వయసులకు అనుగుణంగా స్త్రీల పోషణ, తదితర అంశాలపై అవగాహణ కల్పించారు.
ఈ కార్యక్రమంలో పంచకర్మ విభాగాధిపతి శ్రీ డా.హర్షవర్థన్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.సుబ్బారెడ్డి, గ్రామ పెద్దలు శ్రీ రామనాథం నాయుడు, శ్రీ క్రిష్ణమ నాయుడు, శ్రీ భాస్కర్ నాయుడు, ఇతర వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్లొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.