TEPPOTSAVAM BEGINS AT SRI GT _ వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం

Tirupati, February 06, 2025: The annual float festivals( Teppotsavam) of Sri Govindaraja Swamy temple at Tirupati commenced in great pomp on Thursday evening.

During the first day of Teppotsavam Sri Govindaraja Swamy began on Thursday with great pomp  Sri Kodandarama Swamy rode on the brightly decorated float with flowers and shining electric lights from 6.30 pm to 8 pm and gave darshan to devotees. 

Later, he paraded on a Tiruchi on the four Mada streets of the temple and blessed the devotees.

On the first day, Sri Kodandarama Swamy, accompanied by Sita Lakshmana went five rounds on the float in the Pushkarini. 

Similarly, on Friday, Sri Parthasarathis Swamy will perform five rounds and bless the devotees.

On this occasion, bhajans, Harikatha, and musical programs were organized under the auspices of the TTD  HDPP  and Annamacharya Project 

TTD Deputy EO Smt. Shanti, Temple Inspector Sri Dhananjaya, and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2025 ఫిబ్ర‌వరి 06: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ తెప్పోత్సవాల్లో సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండ‌రామ‌స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.

మొదటిరోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా శుక్ర‌వారం శ్రీ పార్థసారథిస్వామివారు తెప్పలపై ఐదు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ ధ‌నంజ‌య‌, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.