SRI PERIYALWAR FESTIVAL BEGINS _ శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం
SRI PERIYALWAR FESTIVAL BEGINS
Tirupati, 26 June 2025: The annual Sri Periyalwar Utsavam began on Thursday at the Sri Lakshmi Narayana Swamy Temple, associated with Sri Govindaraja Swamy Temple in Tirupati. The celebrations will continue till July 05.
Each day, in the morning and evening, both Sri Pedda Jeeyar Swamy and Sri Chinna Jeeyar Swamy of Tirumala, along with their disciples, recite Divya Prabandha Pasurams before Sri Periyalwar.
On the final day, Tirumanjanam will be performed for Sri Periyalwar in the morning.
In the evening, Sri Govindaraja Swamy will be taken for a celestial ride on Garuda Vahanam, and Sri Periyalwar on Gaja Vahanam, along the four Mada Streets.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం ఆరంభం
తిరుపతి, 2025, జూన్ 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలో శ్రీ పెరియాళ్వార్ ఉత్సవం గురువారం ఘనంగా ప్రారంభమైంది. జూలై 05వ తేదీ వరకు జరుగనుంది.
ఇందులో భాగంగా ఉదయం, సాయంత్రం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి తమ శిష్యబృందంతో కలిసి శ్రీలక్ష్మీ నారాయణ స్వామి వారి ఆలయంలోని శ్రీ పెరియాళ్వార్‌వారి సన్నిధిలో ప్రబంధ పాశురాలను నివేదించారు. చివరి రోజైన జూలై 05వ తేదీ ఉదయం శ్రీ పెరియాళ్వార్‌కు తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీగోవిందరాజస్వామివారు గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్ గజ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.
శ్రీ మహావిష్ణువుకు పెరియాళ్వార్ పరమభక్తుడు. శ్రీ ఆండాళ్ అమ్మవారికి ఈయన తండ్రి. శ్రీ పెరియాళ్వార్ తులసిమాలలు కట్టి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు. తండ్రితో పాటు ఆరాధించిన ఆండాళ్ అమ్మవారు చివరకు స్వామివారినే భర్తగా భావించారు. శ్రీ పెరియాళ్వార్ ఎన్నో పాశురాలను రచించి స్వామివారికి అర్పించారు. ఈయనకు శ్రీమహావిష్ణువు సాక్షాత్కారం జరిగినట్టు అర్చకులు తెలిపారు.
తి.తి.దే., ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.