CLEANLINESS EMPHASIZED AHEAD OF ANNUAL BRAHMOTSAVAMS _ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి

”NANDAKAM” APP FOR MONITORING REAL-TIME SANITARY ISSUES

Tirumala, 14 August 2026: The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary emphasized cleanliness ahead of Brahmotsavams and reviewed sanitation plans and instructed agencies to enhance waste-management operations across Tirumala.

The review meeting was held at Sudharma Hall conference hall in Tirumala on Friday which discussed in length on the improvements in quality standards, procurement of required materials, and adoption of modern equipment to maintain the hill shrine’s sanctity.

To strengthen on-the-ground monitoring, TTD is contemplating a complaint – management app, “Nandakam.”

This app will enable real-time reporting of sanitation issues, automatic escalation to responsible staff, and tracking of resolution progress. Officials are directed to roll out the app next month.

Cleanliness efforts will cover ghat roads, Srivari steps, the Alipiri footpath and surrounding areas.

The Additional EO also appreciated the participation of volunteer groups, including “Mana Ooru – Mana Gudi,” and welcomed their continued support beyond the temple precincts.

He noted that these community efforts are already improving pilgrims’ feedback on cleanliness.

The Additional EO urged every pilgrim to share responsibility for maintaining Tirumala’s cleanliness, reminding them not to discard waste from vehicles or use single-use plastics within the shrine area. He called for cooperation with sanitation staff who work to keep the hill town clean.

The meeting was attended by Deputy EO Health Sri Somannarayana, sanitation department officials, agency representatives and other officers.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో స్వచ్ఛతపై ప్రత్యేక దృష్టి

రియల్‌టైమ్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి ‘నందకం’ యాప్‌ 

టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి

తిరుమల,2026ఆగస్టు 14: వచ్చే నెల 15 తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్వెంకయ్య చౌదరి తెలిపారు.

శుక్రవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో పారిశుద్ధ్య విభాగం అధికారులుసంబంధిత ఏజెన్సీలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడంపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం అదనపు ఈవో మాట్లాడుతూ తిరుమలను మరింత స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలపై ఏజెన్సీల ప్రతినిధులతో చర్చించినట్లు చెప్పారుతిరుమల పవిత్రతకుస్వచ్ఛతకు మారుపేరుగా నిలిచేలా మరింత మెరుగైన పారిశుద్ధ్య కార్యకలాపాలు చేపట్టాలని సూచించినట్లు తెలిపారుఇందుకోసం అవసరమైన మెటీరియల్స్ఆధునిక యంత్రాల వినియోగంపై కూడా చర్చించినట్లు వివరించారు.

రియల్‌టైమ్ ఫిర్యాదుల పరిష్కారానికి ‘నందకం’ యాప్‌

తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కొత్తగా ‘నందకం’ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు యాప్‌ ద్వారా పారిశుద్ధ్యానికి సంబంధించిన ఫిర్యాదులను రియల్‌టైమ్‌లో నమోదు చేసివాటి పరిష్కారాన్ని కూడా పర్యవేక్షించేలా కంప్లైంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను రూపొందిస్తున్నట్లు చెప్పారు.

తిరుమలలో ఎక్కడైనా పారిశుద్ధ్య సమస్య తలెత్తితే వెంటనే యాప్‌ ద్వారా గుర్తించిసంబంధిత సిబ్బందికి సమాచారం అందించిసమస్యను తక్షణమే పరిష్కరించే విధంగా  వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారువచ్చే నెలలో  యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందన్నారు.

తిరుమలతో పాటు ఘాట్ రోడ్లుశ్రీవారి మెట్టుఅలిపిరి ఫుట్‌పాత్‌ఇతర పరిసర ప్రాంతాల్లోనూ స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారుపలు స్వచ్ఛంద సంస్థలు, ‘మన ఊరు – మన గుడి’ వంటి సంస్థలు ముందుకు వచ్చి శుభ్రతా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు.

స్వచ్ఛంద సంస్థలు తిరుమలకే పరిమితం కాకుండా ఘాట్ రోడ్లుఫుట్‌పాత్‌లుపరిసర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇటీవల భక్తుల నుంచి తిరుమలలో స్వచ్ఛతపై మంచి అభిప్రాయాలు వస్తున్నాయని తెలిపారు.

తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణను అధికారులుసిబ్బంది మాత్రమే బాధ్యతగా భావించకుండా ప్రతి భక్తుడు కూడా తన బాధ్యతగా తీసుకోవాలని అదనపు ఈవో కోరారు.

భక్తులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో కిటికీల నుంచి చెత్తను బయటకు విసిరేయడంప్రయాణంలోనే ప్లాస్టిక్ తదితర వస్తువులను పడేయడం వంటి చర్యలు తరచుగా కనిపిస్తున్నాయని తెలిపారుతిరుమలలో ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు భక్తులు ప్లాస్టిక్‌ను తీసుకువచ్చి ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని చెప్పారు.

తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఇక్కడి పవిత్రతస్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యతను గుర్తించాలన్నారుఅధికారులుపారిశుద్ధ్య సిబ్బంది పూర్తిస్థాయిలో పనిచేస్తున్నప్పుడు వారికి భక్తులు కూడా సహకరించాలని కోరారు.

 సమావేశంలో హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణఏజెన్సీల ప్రతినిధులుఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.