GRAND SRI ANDAL AMMAVARI SATTUMORA HELD AT SRI GOVINDARAJA SWAMY TEMPLE _ శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

Tirupati, August 14, 2026: The Sri Andal Ammavari Sattumora was held in a grand manner at Sri Govindaraja Swamy Temple in Tirupati on Friday, marking the conclusion of the Sri Andal Ammavari Thiruvadipuram festival.

As part of the celebrations, Snapana Tirumanjanam was performed to the processional deities of Sri Govindaraja Swamy and Sri Andal Ammavari in the morning.

From 4 pm to 8 pm, the processional deities were taken in a grand procession to Alipiri, where an Asthanam was performed. The procession then returned to the temple via Geetha Mandir, Ramanagar Quarters, Vaikhanasacharyulu Temple, R.S. Mada Street and Chinna Jeeyar Mutt.

Temple Deputy EO Smt. V.R. Shanthi, AEO Sri A.B. Narayana Chowdary, priests and a large number of devotees participated in the celebrations.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘనంగా శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి శాత్తుమొర‌

తిరుపతి, 2026 ఆగస్టు 14: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ముగింపు సంద‌ర్భంగా శుక్రవారం ఘ‌నంగా శాత్తుమొర జ‌రిగింది.

ఇందులోభాగంగా ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహించారు. అనంతరం అలిపిరి నుండి గీతామందిరం, రామనగర్‌ క్వార్టర్స్‌, వైఖానసాచార్యుల వారి ఆలయం, ఆర్‌ఎస్‌ మాడ వీధి, చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంది.

 ఈ కార్య‌క్ర‌మంలో  ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి,  ఏఈవో శ్రీ  ఏ బీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు  పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.