ANKURARPANAM HELD FOR ASHTAANDHANA MAHA SAMROKSHANAM AT DEVUNI KADAPA TEMPLE _ దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ
Tirupati / Devuni Kadapa, August 23, 2026: The Ankuraarpanam for the renovation and Ashtabandhana Maha Samprokshanam of Sri Lakshmi Venkateswara Swamy Temple at Devuni Kadapa was performed as per Agama traditions on Sunday evening.
The rituals included Vastu Shanti, Mrutsangrahanam, Kumbharadhana and Ankuraarpanam, amidst Vedic chants.
On August 24, Vedic rituals including Shanti Homam, Kumbhasthapana and Panchagni Pranayanam will be performed.
On August 25, rituals including Ekashiti Kalasa Snapana, Murti Homam and Ashtabandhanam will be conducted, followed by Shayadhivasam and Shanti Homam in the evening.
On August 26, after the morning rituals, Maha Poornahuti and Maha Samprokshanam will be performed from 9.45 am to 11.30 am under Shravana Nakshatram and Tula Lagnam.
Devotees will be allowed darshan of Sri Lakshmi Venkateswara Swamy after completion of the Maha Samprokshanam.
Deputy EO Smt. A. Prashanthi, AEO Sri Ravi, Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Eswar Reddy and temple priests participated in the programme.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైభవంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణకు అంకురార్పణ
తిరుపతి / దేవుని కడప,2026 ఆగస్టు 23: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ మహోత్సవానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆగమోక్త వైదిక మంత్రోచ్ఛారణల నడుమ వాస్తుశాంతి, మృత్సంగ్రహణం, కుంభారాధన, అంకురార్పణ కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఆగస్టు 24న ఉదయం 8 గంటలకు మనోన్మాన ప్రమాణ శాంతి హోమం, కుంభస్థాపన, పంచాగ్ని ప్రణయనం, శాత్తుమొర, సాయంత్రం 6.30 గంటలకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఆగస్టు 25న ఉదయం 7.30 గంటలకు చతుస్థానార్చన, ఏకశీతి కలశ స్నపనం, మూర్తి హోమం, అష్టబంధనం, సాయంత్రం 6 గంటలకు శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర నిర్వహించనున్నారు.
ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహించి, ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించనున్నారు.
మహాసంప్రోక్షణ అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.






