PAVITROTSAVAMS CONCLUDES _ పూర్ణాహుతితో తిరుమలలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

Tirumala, 25 August 2026: The annual three-day Pavitrotsavams at Tirumala Temple, concluded ceremoniously on Tuesday evening with Pavitra Poornahuti.

In the morning, Snapana Tirumanjanam, afternoon Visesha Samarpana were held, followed by a grand procession of the deities.

The main ritual of Poornahuti was performed at 7 PM in accordance with the Agama Shastra. 

Later, Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi circumambulated the temple and re-entered the sanctum, marking the conclusion of the festival.

Both the Pontiffs of Tirumala, Additional EO Sri Ch. Venkaiah Chowdary, Temple DyEO Sri Lokanatham, and other officials participated in the event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

పూర్ణాహుతితో తిరుమలలో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు

తిరుమల, 2026 ఆగస్టు 25: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతి ఏటా మూడురోజులపాటు నిర్వహించబడే పవిత్రోత్సవాలు మంగళవారంనాడు పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి.

తొలి రెండురోజుల్లాగానే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో ఋత్వికులు హోమాలను నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుండి 11 గంటల నడుమ ఉత్సవమూర్తులకు వరుసగా గోక్షీరము, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపుతో అభిషేకించి చివరగా చందన పూతను పూశారు. ధూపదీప హారతులు నివేదించారు. దీనితో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది.

కాగా మధ్యాహ్నం 1 గంటకు విశేష సమర్పణ, 4 గంటలకు ఉత్సవమూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఇక రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీమలయ్పప్పస్వామివారు శ్రీదేవి, భూదేవిలతో కూడి విమాన ప్రదక్షిణంగా వెళ్ళి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.