‘’CLEANING DAY” FOR A HEALTHIER, HOTLIER TIRUMALA _ తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం ”క్లీనింగ్ డే”
HEALTH DEPARTMENT OF TTD LAUNCHES NEW CLEANING DRIVE ON EVERY TUESDAY
Tirumala, 25 August 2026: With Tirumala poised to welcome tens of thousands of pilgrims for the sacred Srivari annual Brahmotsavams, the TTD Health Department has launched a proactive cleanliness campaign: every Tuesday, that will be observed as “Cleaning Day.”
Under the instructions of TTD Executive Officer Sri Muddada Ravichandra and Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary, the initiative seeks to ensure a spotless environment and hygienic food for all devotees.
Acting on recent complaints about sanitation at some fast‑food centres, Deputy Executive Officer of Health Sri Somanarayana has ordered the shop keepers to close their outlets from 11 a.m. to 5 p.m. each Tuesday for deep cleaning.
This weekly pause will enable thorough removal of accumulated waste, sanitisation of surroundings, and preventive pest control measures — creating a healthier, more welcoming atmosphere for pilgrims.
This Tuesday, fast‑food centres at Third Choultry, PAC‑1, PAC‑2 and other locations underwent deep cleaning. Health inspectors urged shop keepers of various eateries to maintain strict hygiene in food preparation, storage and service, and to keep premises pest‑free.
The Health Department warned of stern action for non‑compliance. TTD appeals to devotees, shopkeepers and staff to join hands in keeping Tirumala Clean.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం ”క్లీనింగ్ డే”
తిరుమల, 2026 ఆగస్టు 25: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరిల ఆదేశాల మేరకు తిరుమలలోని ఫాస్ట్ఫుడ్ సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై ప్రతి మంగళవారం “క్లీనింగ్ డే” ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించింది.
ఇటీవల ఫాస్ట్ఫుడ్ సెంటర్ల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంటోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
వారం రోజుల పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దుకాణాల పరిసరాల్లో పేరుకుపోయే వ్యర్థాలు, మురికి తదితరాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాస్ట్ఫుడ్ సెంటర్లను మూసివేసి సంపూర్ణంగా శుభ్రం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలోని మూడో సత్రం, పీఏసీ–1, పీఏసీ–2 తదితర ప్రాంతాల్లోని ఫాస్ట్ఫుడ్ సెంటర్లను మూసివేసి పరిసరాలను శుభ్రం చేశారు.
దుకాణాల్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు తదితరాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు.
ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో పరిశుభ్రతకు సంబంధించి భక్తుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలను నిర్వహించే వారిపై టీటీడీ ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో తిరుమలలో పారిశుధ్యం, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.









