RETIRED EMPLOYEES EXPERIENCE IS A VALUABLE GUIDE FOR GENERATIONS – TTD EO SRI MUDDADA RAVI CHANDRA _ పదవీ విరమణ ఉద్యోగుల అనుభవాలు భవిష్యత్తు తరాలకు అమూల్య మార్గదర్శకాలు – టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర
EMPLOYEES’ DEDICATED SERVICE TO LORD VENKATESWARA WILL ALWAYS BE REMEMBERED
Tirupati, August 31, 2026: The rich experience of employees who have rendered dedicated service to TTD for several years is highly valuable to the organisation and can serve as a guide for future generations, said TTD Executive Officer Sri Muddada Ravichandra.
A felicitation programme was organised by the TTD Employees Welfare Department at Mahati Auditorium, Tirupati, on Monday to honour 16 retiring employees. The EO inaugurated the programme by lighting the traditional lamp.
Share Service Experiences with Colleagues
The EO urged retiring employees to document important incidents, challenges and valuable lessons from their service and share them with their colleagues. Such practical knowledge from experienced employees will help future generations perform their duties more effectively, he said.
Retirement Benefits on the Day of Retirement
The EO said TTD has taken steps to complete retirement-related service formalities in advance and ensure that all eligible benefits are provided without delay. Efforts are being made to credit the benefits to employees’ accounts on the day of their retirement itself, he said.
Education and Discipline Lead to Success
The EO advised students to set clear goals, maintain discipline and work hard to achieve success in life. He urged them to value the sacrifices of their parents and give priority to education, which provides better opportunities as well as respect in society.
Retiring Employees Felicitated
The retiring employees were honoured with shawls and presented with Srivari Laddu Prasadam. Vedic scholars blessed them with Veda Ashirvachanam.
JEO (Education & Health) Sri Prabhala Gopinath, Deputy EOs Sri Lokanatham, Sri Anandaraju and Sri Govindaraju, retired officials including EE Sri Jayaram Naik and SV Arts College Principal Sri Venugopal Reddy, TTD employees, family members of the retiring employees and students participated in the programme.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
పదవీ విరమణ ఉద్యోగుల అనుభవాలు భవిష్యత్తు తరాలకు అమూల్య మార్గదర్శకాలు
– టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర
శ్రీవారి సేవలో ఉద్యోగుల అంకితభావం చిరస్మరణీయం
తిరుపతి, 2026 ఆగస్టు 31: టీటీడీలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల అనుభవాలు సంస్థకు ఎంతో విలువైనవని, వారి సేవానుభవాలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర అన్నారు.
తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో సోమవారం 16 మంది పదవీ విరమణ ఉద్యోగులకు సామూహిక సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి ఈవో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
సేవానుభవాలు.. భవిష్యత్ తరాలకు విలువైన పాఠాలు
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీలో ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఉద్యోగులు తమ సేవా కాలంలో ఎదుర్కొన్న ముఖ్యమైన సంఘటనలు, సవాళ్లు, వాటిని అధిగమించిన విధానాలు, విధి నిర్వహణలో పొందిన అనుభవాలను నోట్ రూపంలో సిద్ధం చేసి సహచర ఉద్యోగులతో పంచుకోవాలని సూచించారు.
అనుభవజ్ఞులైన ఉద్యోగుల నుంచి లభించే ఈ విలువైన జ్ఞానం భవిష్యత్తులో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
పదవీ విరమణ రోజే ప్రయోజనాలు.. టీటీడీ ప్రత్యేక కార్యాచరణ
ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించిన సర్వీస్ ప్రక్రియలను ముందుగానే పూర్తి చేసి, వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందేలా చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు.
పదవీ విరమణ పొందే రోజే ఉద్యోగులకు అందాల్సిన అన్ని ప్రయోజనాలు వారి ఖాతాల్లో జమ అయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
విద్యతోనే ఉన్నత భవిష్యత్తు.. క్రమశిక్షణతో లక్ష్య సాధన
విద్యార్థులు క్రమశిక్షణతో తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, పట్టుదలతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఈవో పిలుపునిచ్చారు.
తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను గుర్తించి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్య జీవితంలో ఉన్నత అవకాశాలతో పాటు సమాజంలో గౌరవాన్ని కూడా అందిస్తుందని తెలిపారు.
పదవీ విరమణ ఉద్యోగులకు ఘన సన్మానం
అనంతరం పదవీ విరమణ పొందిన ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సన్మానించి, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు.
ఈ కార్యక్రమంలో జేఈవో (విద్య, ఆరోగ్యం) శ్రీ ప్రభల గోపీనాథ్, డిప్యూటీ ఈవోలు శ్రీ లోకనాథం, శ్రీ ఆనందరాజు, శ్రీ గోవిందరాజు, పదవీ విరమణ పొందిన అధికారులు ఈఈ శ్రీ జయరామ్ నాయక్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, టీటీడీ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.







