FIVE-DAY KAREERISTI YAGAM TO CONCLUDE WITH PURNAHUTI ON SEPTEMBER 03 _ రేపు పూర్ణాహుతితో ముగియనున్న ఐదు రోజుల కారీరిష్టి యాగం

TTD CONDUCTING THIS YAGAM FOR THE PAST THREE DECADES

BLACK MATERIALS PLAY A VITAL ROLE IN APPEASING RAIN GOD

Tirumala, 02 September 2026: The five-day Kareerishti Yagam, Parjanya Shanti Homam and Varuna Japam will conclude with Purnahuti on September 03 between 11am and 12noon.

TTD has been conducting this Yagam in Tirumala for over three decades seeking a good amount of rains and prosperity for the state and the country.

Special features of Karirishti Yagam:

The unique feature of this Yagam is the usage of ”Krishnavarna” (black) materials.

As per Vedic tradition, superior substances such as a black horse, black sheep, black honey, black rice, and black dates are used as per shastra.  It is believed that this leads to dense clouds and shower abundant rainfall.

Special importance to invocation of Varuna Devata:

The Yagam is performed chanting the “Marutamasi” Mantras from Krishna Yajurveda. “Galijeru” leaves (Punarnava-Boerhavia diffusa) are offered as Homa Dravya.

Lamps prepared with “Vepashashaka” (Prabbbala leaves-life plant or miracle leaves) are lit around the sacred fire altar, and the Vedic ritual is conducted by the ritwiks who also wear ”Black attires”.

The black smoke that arises when ”Galijeru”(spreading hogweed) leaves are offered in the homa holds special significance in the Vedic procedure and is considered a symbol of abundant rains.

Varuna Japa mantras:

Along with the Kareerishti Yagam, Vedic scholars also perform Varuna Japa chanting the “Varunanuvakas”.

The five-day Vedic ritual which commenced on August 30 with Ankurarpanam, will conclude with Purnahuti on September 03 between 11 AM and 12 noon.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

రేపు పూర్ణాహుతితో ముగియనున్న ఐదు రోజుల కారీరిష్టి యాగం

తిరుమలలో దాదాపు మూడు దశాబ్దాలుగా జరుగుతున్న యాగం 

తిరుమల,2026సెప్టెంబర్ 2: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రందేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కారీరిష్టి యాగం రేపు పూర్ణాహుతితో ముగియనుంది.

కరీరిష్టి యాగ విశేషాంశాలు :

కృష్ణ వర్ణ పదార్థాల వినియోగ ప్రాధాన్యం:

వైదిక సంప్రదాయంలో వర్షసమృద్ధి కోసం రుత్వికులు నల్లని వస్త్రాలను ధరించి నిర్వహించే  ఇష్టి యాగంలో  నల్లని గుర్రంనల్లని గొర్రెనల్లని తేనెనల్లని బియ్యంనల్లని ఖర్జూరం వంటి శ్రేష్ఠమైన ద్రవ్యాలను శాస్త్రోక్తంగా ఉపయోగిస్తారుతద్వారా మేఘాలు దట్టంగా కమ్మి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని విశ్వాసం.

వరుణ దేవత ఆవాహనకు విశిష్ట ప్రాధాన్యత:

కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ”మారుతమసి” మంత్రాలను జపిస్తూ ఇష్టి యాగాన్ని నిర్వహిస్తారుయాగంలో ”గలిజేరు” ఆకుల (పునర్నవ)ను హోమ ద్రవ్యంగా సమర్పిస్తారు.

అలాగే ”వేపశశాక” (ప్రబ్భల)తో తయారు చేసిన సమిధలను హోమగుండం చుట్టూ వెలిగించి వైదిక విధానంలో యాగక్రతువును రుత్వికులు నిర్వహిస్తారు.

అదేవిధంగాగలిజేరు ఆకులను హోమంలో సమర్పించే సమయంలో వచ్చే నల్లని పొగకు కూడా వైదిక ప్రక్రియ లో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందిఇది సమృద్ధికరమైన వర్షాలకు సంకేతం.

వరుణ జప మంత్రాలు :

కారీరిష్టి యాగంతో పాటు ”వరుణానువాకాలను జపిస్తూ వరుణ జపాన్ని వైదికులు నిర్వహిస్తారు.

లోకక్షేమం కోసం వైదిక క్రతువు:

సకాలంలో వర్షాలు కురిసి భూమి సస్యశ్యామలంగా మారాలనిపంటలు సమృద్ధిగా పండాలనిజల వనరులు నిండాలనిరైతులు సుభిక్షంగా ఉండాలనిప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని సంకల్పిస్తూ  యాగాన్ని టీటీడీ 1994 సంవత్సరం నుండి నిర్వహిస్తోంది.

కాగా ఐదు రోజుల పాటు కొనసాగుతున్న  వైదిక క్రతువు సెప్టెంబర్ 03 ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల నడుమ పూర్ణాహుతితో ఘనంగా ముగియనుంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.