PANCHAHNIKA KAREERISTI YAGAM CONCLUDES WITH MAHA POORNAHUTHI _ మహాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన కారీరిష్టి యాగం

Tirumala, 03 September 2026: The five-day Kareeristi, Varuna Japa and Parjanya Shanti Homams conducted by TTD at the Dharma Giri Veda Vignana peetam in Tirumala for the welfare of humanity concluded ceremonially with Maha Poornahuthi on Thursday.

TTD Executive Officer Sri Muddada Ravichandra and Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary participated in the programme. On the occasion, Sri Kuppa Siva Subrahmanya Avadhani, Principal of Sri Venkateswara Veda Vignana Peetham, recited the mantras related to Kareeristi, Varuna Japa and Parjanya Shanti and led the participants in chanting them.

Speaking on the occasion, he said that the rituals were conducted following a tradition that has been observed for several decades, seeking the divine blessings of Sri Venkateswara for timely and beneficial rains across India, so that people are free from the hardships caused by excessive or deficient rainfall and prosper with good crops and cattle wealth.

He said that for the past five days, the Kareeristi along with Varuna Japa and Parjanya Shanti rituals were performed in an elaborate manner with the participation of 32 Ritwiks, and the entire programme was completed with Maha Poornahuthi on Thursday.

He further said that prayers were offered to Sri Venkateswara, the Rishis and great sages for abundant and timely rains across the country and for the prosperity and well-being of India.

TTD Board Members Smt. Panabaka Lakshmi, Sri Bhanu Prakash Reddy and Sri Shanta Ram, along with faculty members and students of the Dharmagiri Veda Vignana Peetham, participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

మహాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిసిన కారీరిష్టి యాగం

తిరుమల, 2026 సెప్టెంబర్ 03: తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఐదు రోజుల పాటు టీటీడీ నిర్వహించిన కారీరిష్టి, వరుణ జపం, పర్జన్యశాంతి హోమాలు గురువారం మహాపూర్ణాహుతితో శాస్త్రోక్తంగా ముగిశాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ శ్రీ కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని కారీరిష్టి, వరుణ జపం, పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీవారి దివ్య అనుగ్రహంతో భారతదేశవ్యాప్తంగా సకాలంలో సస్యానుకూలమైన వర్షాలు కురిసి, అతివృష్టి, అనావృష్టి బాధలు లేకుండా ప్రజలందరూ మంచి పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అనుసరించి ఈ యాగాలను నిర్వహించినట్లు తెలిపారు.

గత ఐదు రోజులుగా 32 మంది ఋత్వికులతో కారీరిష్టి సహిత వరుణ జపం, పర్జన్యశాంతి కార్యక్రమాలను వైభవంగా నిర్వహించి, మహాపూర్ణాహుతితో సంపూర్ణం చేసినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ శాంతా రామ్, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.