ADDITIONAL EO REVIEWS RECEPTION DEPARTMENT _ రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష
Tirumala, 03 September 2026: In view of the annual Srivari Salakatla Brahmotsavams scheduled to be held from September 15 to 23, TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary held a review meeting on the arrangements by the Reception Department at the Sudharma Conference Hall in Tirumala, on Thursday.
During the meeting, he directed the officials to take necessary measures to ensure that devotees face no inconvenience in the allotment of accommodation during the ensuing Brahmotsavams. He instructed the officials concerned to complete any pending repairs in the rooms at the earliest.
He also directed the Reception Department to bring 60 per cent of the rooms in the mutts and Karnataka Choultries in Tirumala under its control during the Brahmotsavam days, so that accommodation could be provided to staff arriving on deputation for Brahmotsavam duties.
Tirumala Estate Officer Sri Venkateswarlu, In-charge IT GM Sri Venkateswarlu Naidu, Reception OSD Sri Satre Naik, AEO Sri Ashok and other officials participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష
తిరుమల, 2026 సెప్టెంబర్ 03: ఈ నెల 15 నుండి 23వ తేది వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి గదుల కేటాయింపునకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య ఆదేశించారు.
గురువారం తిరుమలలోని సుధర్మ సమావేశ మందిరంలో రిసెప్షన్ విభాగంపై అదనపు ఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గదులకు మరమ్మతులు ఏవైనా ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
బ్రహ్మోత్సవ విధులకు డిప్యూటేషన్ పై వచ్చే సిబ్బందికి వసతి కేటాయించేందుకు వీలుగా తిరుమలలోని మఠాలు, కర్ణాటక సత్రాల్లోని 60 శాతం గదులను బ్రహ్మోత్సవ రోజుల్లో టీటీడీ రిసెప్షన్ విభాగం నియంత్రణలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో తిరుమల ఎస్టేట్ అధికారి శ్రీ వేంకటేశ్వర్లు, ఇన్ ఛార్జ్ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, రిసెప్షన్ ఓఎస్డీ శ్రీ సత్రే నాయక్, ఏఈఓ శ్రీ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


