COMPLETE MUSEUM WORKS ON TIME _ మ్యూజియం పనులను సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

STRENGTHEN MOBILE NETWORK FOR BRAHMOTSAVAMS: TTD ADDITIONAL EO

Tirumala, 07 September 2026: In view of the inauguration of the SV Museum at Tirumala by Andhra Pradesh Chief Minister Sri Nara Chandrababu Naidu during the upcoming annual Brahmotsavams, all departments must complete their assigned works within the stipulated time and ensure full readiness for the function, directed TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary.

He held a review meeting with concerned officials on Monday at Tirumala on museum arrangements and inspected the facility. 

He ordered that all facilities and basic amenities required for devotees must be fully operational. Every department should complete its tasks on schedule without any lapses and be ready for the inauguration. 

Officials were also directed to provide necessary information and guidance to the TCS team for museum maintenance. All departments must work in coordination to ensure a smooth, hassle-free inauguration function, he reiterated.

The Additional EO also reviewed the mobile signal system and cell tower performance at Tirumala. He directed officials to take special measures to ensure improved mobile network facilities for devotees at Tirumala, on ghat roads and footpaths during the upcoming annual Srivari Brahmotsavams.

Special attention should be given to mobile signal strength on Garuda Seva day, wherein a heavy rush of devotees is expected. Network capacity must be enhanced in line with the crowd to ensure uninterrupted mobile services.

Officials, along with service providers, reviewed the number of cell towers currently available and functional at Tirumala, ghat roads and footpaths. 

The Additional EO directed service providers to ensure all available towers operate at full capacity. All technical arrangements must be completed in advance to prevent any communication issues for devotees during Brahmotsavams.

Tirumala Estate Officer Sri Venkateswarlu, Deputy EO Sri Somannarayana, SE Sri Venkateswarulu, EE Sri Srinivasarao, DE Sri Chandra Sekhar and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

మ్యూజియం పనులను సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

తిరుమల, 2026 సెప్టెంబర్ 07: ఏపీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ  మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు తమకు అప్పగించిన పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమలలో సోమవారం సంబంధిత అధికారులతో మ్యూజియం ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించి, ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మ్యూజియంలో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి విభాగం తమకు కేటాయించిన పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

అదేవిధంగా మ్యూజియం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై టీసీఎస్‌ బృందానికి కూడా అవసరమైన సమాచారం, సూచనలు అందించాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, ప్రారంభోత్సవ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థను పటిష్టం చేయాలి

అనంతరం తిరుమలలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ వ్యవస్థ, సెల్‌ టవర్ల పనితీరుపై అదనపు ఈవో సమీక్ష నిర్వహించారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలతో పాటు కాలిబాటలు, ఘాట్‌ రోడ్లలో భక్తులకు మెరుగైన మొబైల్‌ నెట్‌వర్క్‌ సదుపాయం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా గరుడసేవ రోజున భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్నందున, ఆ రోజు మొబైల్‌ సిగ్నల్‌ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచి, ఎలాంటి అంతరాయం లేకుండా మొబైల్‌ సేవలు అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రస్తుతం తిరుమల, ఘాట్‌ రోడ్లు, కాలిబాటల్లో ఎన్ని సెల్‌ టవర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయనే అంశాలను అధికారులు, సంబంధిత సర్వీస్‌ ప్రొవైడర్లతో కలిసి సమీక్షించారు. అందుబాటులో ఉన్న అన్ని సెల్‌ టవర్లు పూర్తిస్థాయిలో పనిచేసేలా సంబంధిత సరఫరాదారులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవో స్పష్టం చేశారు.

బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి కమ్యూనికేషన్‌ సమస్యలు తలెత్తకుండా ముందుగానే అన్ని సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసి, నెట్‌వర్క్‌ వ్యవస్థను పటిష్టంగా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశాల్లో ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఎస్ఈ శ్రీ శ్రీనివాసులు, ఈఈ శ్రీ శ్రీనివాసరావు, డిఈ శ్రీ చంద్ర శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.