SOUGHT THE DIVINE BLESSINGS ON ENTIRE COUNTRY – UP CM _ శ్రీవారిని సేవలో ఉత్తర ప్రదేశ్ సీఎం శ్రీ యోగి ఆదిత్యనాథ్
COMPLIMENTS TTD ON TEMPLE MANAGEMENT, SPIRITUAL UPKEEP AND CLEANLINESS
Tirumala, 07 September 2026: The Honourable CM of UP Sri Yogi Adityanath Offers Prayers at Tirumala on Monday evening.
The UP CM offered prayers in the sacred hill shrine of Sri Venkateswara Swamy through Vaikuntham Queue Complex.
After Darshan he was offered Vedaseervachanam in the Ranganayakula Mandapam by Vedic Scholars. Later he was offered Theertha Prasadams of Srivaru by the TTD Additional EO Sri Ch Venkaiah Chowdary.
Speaking on the occasion, he said he prayed to Sri Venkateswara, the incarnation of Sri Maha Vishnu, to bestow His benign blessings on AP, UP and entire country.
He complimented TTD for efficient pilgrim management, cleanliness and up keeping the spiritual atmosphere at Tirumala.
The UP CM also expressed his immense pleasure for having darshan of Sri Sita Lakshmana sameta Sri Ramachandra Swamy Utsava deities owing to Punarvasu Nakshatram, a system established by Saint Sri Ramanujacharya, over 1000 years ago. ”Along with Sri Venkateswara, I had the privilege of the divine Darshan of Sri Maryada Purushottam today”, he maintained.
Both the Pontiffs of Tirumala, one of the Chief Priests of the temple Sri Venugopala Deekshitulu were also present during the procession.
The dignitaries who accompanied the UP CM included AP Ministers Sri Narayana, Sri Satya Kumar Yadav, AP BJP Chief Sri Madhav, TTD Board Member Sri Bhanuprakash Reddy and others.
Among others TTD cvso Sri Muralikrishna, Tirupati SP Sri Subbarayudu, DyEO Sri Bhaskar and others were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి సేవలో ఉత్తర ప్రదేశ్ సీఎం శ్రీ యోగి ఆదిత్యనాథ్
ఆలయ నిర్వహణ, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై టీటీడీకి అభినందనలు
తిరుమల, 2026 సెప్టెంబర్ 07: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల విచ్చేసిన శ్రీ యోగి ఆదిత్యనాథ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలను యూపీ సీఎంకు అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీ యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించి యావత్ దేశ ప్రజలకు స్వామివారి కృపాకటాక్షాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.
తిరుమలలో టీటీడీ చేపడుతున్న సమర్థవంతమైన క్యూ లైన్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణను ఆయన అభినందించారు.
పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీవారి ఆలయంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామివారి ఉత్సవమూర్తులను కూడా యూపీ సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగద్గురు శ్రీ రామానుజాచార్య సుమారు 1000 సంవత్సరాల క్రిందట తిరుమలలో ఏర్పాటు చేసిన వ్యవస్థ లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తో పాటు శ్రీరాముల వారి దివ్య రూపాన్ని కూడా తిరుమలలో నేడు దర్శించుకోవడం ఆనందదాయకమన్నారు.
తిరుమల పెద్ద జియ్యంగారు మరియు చిన్న జియ్యంగారు , ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు కూడా ఉన్నారు.
కాగా ఏపీ మంత్రలు శ్రీ నారాయణ, శ్రీ సత్య కుమార్ యాదవ్, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాశ్ రెడ్డి తదితరులు యూపీ సీఎం తిరుమల దర్శనం లో పాల్గొన్నారు.
అదేవిధంగా టీటీడీ సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ తదితరులు కూడా ఉన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.







