DIGITAL MAPPING OF TIRUMALA SHOPS REVIEWED _ తిరుమలలో దుకాణాలకు ‘జియో ఫెన్సింగ్’ 

Tirumala, 09 September 2026: TTD is developing a dedicated mobile app to map all shops, hotels and commercial establishments in Tirumala using advanced technology and to streamline licence monitoring.

TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary reviewed the app’s progress with Amaravati Solutions representatives at Sudharma Meeting Hall in Tirumala on Wednesday.

The agency demonstrated features including a unified platform for shop details, licence information, expiry dates and precise location tracking through the App.

The Additional EO directed officials to ensure transparency, efficiency and comprehensive registration of all commercial establishments to improve service management.

TTD In-charge FA&CAO Sri Ravi Prasad, Tirumala Estate Officer Sri Venkateswarlu, CAO Sri Venkata Ramana, In-charge IT GM Sri Venkateswarlu Naidu, Amaravati Solutions representatives and other officials were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తిరుమలలో దుకాణాలకుజియో ఫెన్సింగ్ 

యాప్‌ రూపకల్పనపై అదనపు ఈవో సమీక్ష

తిరుమల, 2026 సెప్టెంబరు 09: తిరుమలలోని దుకాణాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల వివరాలను డిజిటల్‌ విధానంలో సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, లైసెన్సుల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తోంది.

ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌. వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో యాప్ ను రూపొందిస్తున్న అమరావతి సొల్యూషన్స్‌ సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

దీనిపై ఆ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా యాప్‌ గురించి అదనపు ఈవోకు వివరించారు. తిరుమలలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం, లైసెన్సు వివరాలు, గడువు తేదీలు తదితర అంశాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేలా యాప్ ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. జియో ఫెన్సింగ్‌ సాంకేతికత ఆధారంగా దుకాణాల ఖచ్చితమైన స్థానాలను గుర్తించి, వాటి నిర్వహణ, పర్యవేక్షణను సులభతరం చేసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు.

అనంతరం యాప్‌ రూపకల్పన పురోగతి, అందులో పొందుపరుస్తున్న సదుపాయాలు, జియో ఫెన్సింగ్‌ వ్యవస్థ అమలు, లైసెన్సింగ్‌ నిర్వహణ తదితర అంశాలపై అదనపు ఈవో సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారదర్శకత మరియు సమర్థతకు ప్రాధాన్యతనిస్తూ యాప్ ను అభివృద్ధి చేయాలని సూచించారు.

తిరుమలలోని అన్ని వ్యాపార సంస్థల వివరాలను సమగ్రంగా నమోదు చేసి, సేవల నిర్వహణను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో టీటీడీ ఇన్ ఛార్జ్ ఎఫ్ఏ&సీఏఓ శ్రీ రవి ప్రసాదు, తిరుమల ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వేంకటేశ్వర్లు, సీఏఓ వెంకట రమణ, ఇన్ ఛార్జ్ ఐటీ జీఎం శ్రీ వేంకటేశ్వర్లు నాయుడు, అమరావతి సొల్యూషన్స్ సంస్థ ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.