45TH DEATH ANNIVERSARY OF SRI SADHU SUBRAHMANYA SASTRY ON SEPTEMBER 10 _ సెప్టెంబర్ 10న అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 45వ వర్ధంతి

104TH BIRTH ANNIVERSARY OF SRI GAURIPEDDI RAMASUBBA SARMA TO BE OBSERVED

Tirupati, September 9, 2026: TTD Hindu Dharma Projects and Annamacharya Project will organise programmes at Annamacharya Kalamandiram, Tirupati, on September 10 to mark the 45th death anniversary of Sri Sadhu Subrahmanya Sastry and the 104th birth anniversary of Sri Gauripeddi Ramasubba Sarma.

Floral tributes will be offered at the statues of Sri Sadhu Subrahmanya Sastry at 9.30 am near Sweta Bhavan and Sri Gauripeddi Ramasubba Sarma at 10 am at SV Oriental College.

A commemorative meeting on Sri Sadhu Subrahmanya Sastry will be held at 10.30 am at Annamacharya Kalamandiram.

The programme marking the 104th birth anniversary of Sri Gauripeddi Ramasubba Sarma will be held at 6 pm at the same venue.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సెప్టెంబర్ 10 అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 45 వర్ధంతి

•  శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారి 104 జయంతి ఉత్సవాలు

తిరుపతి, 2026 సెప్టెంబరు 09: టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబరు 10వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 45వ వర్ధంతి, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 104వ జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ముందుగా ఉదయం 9.30 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి, ఉదయం 10 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది.

అనంతరం ఉదయం 10.30 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వర్ధంతి సందర్భంగా సభా కార్యక్రమం నిర్వహిస్తారు. 

సాయంత్రం 6 గంటలకు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 104వ జయంతి సందర్భంగా సభా కార్యక్రమం ఉంటుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.