ANDAL SRI GODA DEVI GARLANDS REACHES TIRUMALA _ శ్రీవారి గరుడసేవకు శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలలు
Tirumala, 18 September 18: The sacred garlands of Andal Sri Goda Devi garlands from Srivilliputhur, Tamil Nadu, arrived Tirumala on Friday evening to be adorned to Sri Malayappa Swamy during the prestigious Garuda Seva which is set to take place on Saturday.
The garlands were first taken to Sri Peddajeeyar Mutt near Sri Bedi Anjaneya Swamy Temple, where special pujas were performed under the guidance of Sri Sri Sri Peddajeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy of Tirumala.
They were then brought in a grand procession through the Mada streets to the Sri Venkateswara Temple amidst traditional nadaswaram and music.
Two Families Offer Andal and Sikhamani Garlands:
The Andal Garland and Sikhamani Garland are traditionally offered by two families of flower artisans from Srivilliputhur, about 650 km from Tirupati.
Spiritual Significance:
It is an age-old tradition to adorn the processional deity on Garuda Seva day with the garland first decorated to Goda Devi (Andal) in Srivilliputhur.
According to the legend, Goda Devi would first wear the garland out of devotion and then offer it to Sri Ranganatha, who accepted only those garlands she had worn.
Goda Devi is regarded as an incarnation of Bhudevi, one of the consorts of Sri Venkateswara Swamy.
The event was attended by TTD EO Sri Muddada Ravichandra, Additional EO Sri Ch. Venkaiah Chowdary, Temple Deputy EO Sri Bhaskar, Srivilliputhur temple priests and other officials.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారి గరుడసేవకు శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలలు
భక్తిశ్రద్ధలతో తిరుమలకు చేరుకున్న ఆండాళ్, శిఖామణి మాలలు
తిరుమల, 2026 సెప్టెంబర్ 18: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడసేవ సందర్భంగా శ్రీమలయప్పస్వామివారికి అలంకరించేందుకు తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు నుంచి గోదాదేవి మాలలు శుక్రవారం తిరుమలకు చేరుకున్నాయి.
ముందుగా ఈ మాలలను తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దనున్న శ్రీ పెద్దజీయర్ మఠానికి తీసుకువచ్చారు. శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో మాలలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు.
రెండు కుటుంబాల నుంచి ఆండాళ్, శిఖామణి మాలలు
ఆండాళ్ మాల, శిఖామణి మాలగా పిలువబడే ఈ రెండు విశిష్ట పుష్పమాలలను తిరుపతికి సుమారు 650 కిలోమీటర్ల దూరంలోని శ్రీవిల్లిపుత్తూరుకు చెందిన రెండు కుటుంబాల పూల తయారీదారులు సంప్రదాయబద్ధంగా సమర్పిస్తున్నారు.
గోదాదేవి మాలలకు విశిష్ట ఆధ్యాత్మిక ప్రాశస్త్యం
శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవికి అలంకరించిన పుష్పమాలను గరుడసేవ రోజున శ్రీవారికి అలంకరించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం.
పురాణ కథనాల ప్రకారం, శ్రీరంగమన్నార్ స్వామివారికి పుష్పకైంకర్యం చేసిన శ్రీ పెరియాళ్వార్ కుమార్తె గోదాదేవి, స్వామివారిపై అపారమైన భక్తితో పుష్పమాలను ముందుగా తాను ధరించి, అనంతరం స్వామివారికి సమర్పించేవారు. గోదాదేవి భక్తిని గుర్తించిన శ్రీరంగనాథుడు, ఆమె ధరించిన మాలలనే స్వీకరించారని భక్తుల విశ్వాసం. గోదాదేవిని శ్రీవారి దేవేరి అయిన భూదేవి అవతారంగా భావిస్తారు.
ఈ పవిత్ర సంప్రదాయం గరుడసేవకు మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చుతోంది.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, శ్రీవిల్లిపుత్తూరు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.





