ABHISHEKAM TO KSHETRAPALAKA RUDRA HELD _ తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

TIRUMALA, 18 FEBRUARY 2023: In connection with Maha Siva Ratri on Saturday, a special abhishekam was performed to Kshetrapalaka Rudra near Gogarbham in Tirumala.

Every year TTD performs this special ritual on the auspicious occasion of Maha  Sivaratri.

A team of temple staff including Archakas reached Kshetrapalaka Rudra and performed Abhishekam with milk, curd, sandal paste, panneeru, coconut water.

After offering Neivedyam, they distributed prasadams to devotees and returned to the temple.

Temple Peishkar Sri Srihari and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తిరుమలలో క్షేత్రపాలకుడికి వేడుకగా అభిషేకం

ఫిబ్రవరి 18, తిరుమల 2023: తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి శనివారం నాడు వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, ఇతర సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.