SIVARATRI CULTURAL FIESTA AT KT _ కపిలతీర్థంలో నిరంతరాయంగా మహాశివరాత్రి సంగీత, నృత్య కార్యక్రమాలు

TIRUPATI, 18 FEBRUARY 2023: The annual brahmotsavam at Sri Kapileswara Swamy temple witnessed a series of devotional cultural programmes that captivated the devotees on Saturday.

On the auspicious occasion of Maha Sivaratri, TTD organised programs with HDPP, SVCMD and Annamacharya Project.

The vocal performance by Dr Vandana, Bhakta Markandeya Harikatha by Smt Vijayalakshmi, Sri Ramakoteswara Rao, Nrityanjali by students of SV College of Music and Dance under the guidance of Smt Uma Muddubala attracted the devotees.

SVCMD Special Officer Sri Sesha Sailendra, Principal Sri Sudhakar were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కపిలతీర్థంలో నిరంతరాయంగా మహాశివరాత్రి సంగీత, నృత్య కార్యక్రమాలు
 
– భక్తిభావాన్ని పంచిన డా. వందన గాత్ర సంగీతం
 
తిరుపతి, 2023 ఫిబ్రవరి 18: శ్రీకపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద శనివారం నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, నాదస్వరం పాఠశాల, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉదయం 9 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
 
ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె.వందన గాత్రం, డా. కె. వి.కృష్ణ వయోలిన్, శ్రీ యం.సుధాకర్, శ్రీ కృష్ణవంశీ మృదంగం, శ్రీ రామకృష్ణ మోర్సింగ్ పై నిర్వహించిన సంగీత కచేరి అలరించింది. ఇందులో ముదాకరాతమోదకం, నా దా తను మనిషం, చంద్రశేఖరాష్టకం, శివనామ సంకీర్తన, శివతాండవ స్తోత్రం, నామ సంకీర్తన, నిన్ను విడిచి ఉండలేనయా… కీర్తనలు ఉన్నాయి.
 
ముందుగా ఉదయం 9 గంటలకు శ్రీమతి విజయలక్ష్మి భక్త మార్కండేయ హరికథ గానం చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీ ఉదయభాస్కర్ అన్నమయ్య సంకీర్తనలు చక్కగా పాడి వినిపించారు. ఆ తర్వాత రామకోటేశ్వరరావు హరికథ గానం చేశారు. మధ్యాహ్నం అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీమతి జి.రేవతి బృందం నిర్వహించిన గాత్ర సంగీతం ఆకట్టుకుంది. టీటీడీ పురాణ పండితుడు శ్రీ శేషసాయిబాబు శివ పురాణంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
 
సాయంత్రం ఎస్వీ సంగీత కళాశాల ఆధ్వర్యంలో శ్రీ సాకేత్ కీబోర్డుపై, శ్రీ కృష్ణవంశీ మృదంగంపై చక్కటి వాయిద్య సంగీతం వినిపించారు. ఎస్వీ నాదస్వర పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ హ‌రిబాబు బృందం నాదస్వరం, శ్రీ వైఎల్.శ్రీనివాసులు  బృందం డోలు, శ్రీ అనంతకృష్ణ వేణువుపై మంగళధ్వని వినిపించారు.
 
 అదేవిధంగా కళాశాల అధ్యాపకులు శ్రీమతి ఎం.ఉమా ముద్దుబాల నృత్య పర్యవేక్షణలో విద్యార్థినులు చక్కగా భరతనాట్యాన్ని ప్రదర్శించారు. ఇందులో గణేష్ పుష్పాంజలి, శంభు నటనం, శంకర శ్రీ గురునాథ ప్రభ, భో శంభో శివ శంభో, నృత్యతి సాంబశివోహం, నారాయణతే నమో నమో.. తదితర కీర్తనలకు చక్కగా నృత్యం చేశారు.
 
అదేవిధంగా, రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ జగదీష్ బృందం నృత్య ప్రదర్శన, రాత్రి 11 నుంచి 12.30 గంటల వరకు ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ సురేష్ బాబు బృందం శివోహం భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత కళాశాల ప్రత్యేకాధికారి శ్రీ శేష శైలేంద్ర, ప్రిన్సిపాల్ శ్రీ ఎం.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.