ACCOMMODATION IN TIRUMALA BECOMES MORE PILGRIM FRIENDLY _ వ‌స‌తి గ‌దుల కేటాయింపు నూత‌న విధానంపై భ‌క్తుల సంతృప్తి

DEVOTEES HAIL TTD’s NEW ACCOMMODATION ALLOTMENT SYSTEM

 TIRUMALA, 12 JULY 2021: The new system of allotment of accommodation in Tirumala has been receiving lot of appreciation from the visiting pilgrims as the waiting period has come down now.

To avoid delay in the allotment of accommodation to pilgrims, TTD decentralized the registration of accommodation during last month. New registration counters at six locations in Tirumala came into force from June 12 onwards. Earlier the registration was being done at CRO alone. The new locations includes GNC Tollgate, Balaji bus stand, Kausthubham Rest House, Rambagicha Rest House, MBC apart from CRO. 

The devotees who booked accommodation in on-line through advance reservation have to scan their ARP slips at Alipiri tollgate, Alipiri footpath and Srivarimettu footpath routes. The devotees who prefer to reach Tirumala through road way will get SMS to their registered mobile number in 30 minutes along with the name of the Sub-Enquiry office they have to approach to get their accommodation while those trekking Alipiri footpath in three hours and Srivarimettu in one hour. (However, at present Alipiri footpath route is non-functional as it is under renovation). The pilgrim directly goes to that particular sub-enquiry office, by showing the SMS and gets allotted with the accommodation as per the tariff he had chosen while booking in on-line on availability. In current booking, the devotee gets registered at any one of these registration counters. He gets SMS to his registered mobile number along with the name of the sub-enquiry office where the accommodation is allotted to him. 

So far 70148 pilgrims availed the accommodation facility in the last one month since the inception of new allotment system which includes 35418 under ARP and 34730 in current booking at Tirumala.

A software Engineer Sri M Satish from Bengaluru expressed immense satisfaction over the new allotment system. Earlier we used to run from pillar to post in search of rooms and wait for hours together at CRO General for accommodation. I came in my own vehicle and by the time I reached Tirumala on the 40th minute, I got allotted with my rest house at Koustubham without any waiting. It is really a welcoming initiative by TTD”, he said.

Sri Sivaprakasan from Sivakasi of Tamilnadu said, I used to be a regular devotee of Elumalayaan. I had seen the permutations and combinations that took place in the allotment system by TTD management from time to time in the last two decades. But the present system of decentralization of accommodation mulled by TTD is the best move taken for the convenience of the pilgrims. Earlier we used to stand in serpentine queue lines at CRO. But I was allotted with a room at MBC within no time”, he expressed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌స‌తి గ‌దుల కేటాయింపు నూత‌న విధానంపై భ‌క్తుల సంతృప్తి

తిరుపతి, 2021 జులై 12: తిరుమ‌ల‌లో వ‌స‌తి గ‌దుల కేటాయింపు కోసం జూన్ 12న ప్ర‌వేశ‌పెట్టిన‌ నూత‌న విధానంపై భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విధానంతో భ‌క్తులు గ‌దుల కోసం వేచి ఉండాల్సిన స‌మ‌యం బాగా త‌గ్గిపోయింది.

భ‌క్తుల‌కు వ‌స‌తి గ‌దులు కేటాయించ‌డంలో జ‌రుగుతున్న ఆల‌స్యాన్ని నివారించేందుకు ఆరు ప్రాంతాల్లో రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్ల‌ను టిటిడి ఏర్పాటుచేసింది. సిఆర్‌వో వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, బాలాజి మెయిన్ బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, కౌస్తుభం అతిథి భ‌వ‌నం వ‌ద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంట‌ర్లు, రాంభ‌గీచా బ‌స్టాండ్ వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద రెండు కౌంట‌ర్లు, జిఎన్‌సి టోల్‌గేట్ వ‌ద్ద 2 కౌంట‌ర్ల‌ను ఏర్పాటుచేశారు. జూన్ 12వ తేదీ నుండి ఈ కౌంట‌ర్లు ప‌నిచేస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో గ‌దులు అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకున్న భ‌క్తులు సంబంధిత గ‌దుల స్లిప్పుల‌ను తిరుప‌తిలోనే స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అలిపిరి టోల్‌గేట్‌, అలిపిరి, శ్రీ‌వారిమెట్టు న‌డ‌క‌మార్గాల్లో కౌంట‌ర్లు ఏర్పాటు చేశారు. అలిపిరి టోల్‌గేట్ నుండి తిరుమ‌ల‌కు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్ చేసుకున్న 30 నిమిషాల్లో ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అలిపిరి న‌డ‌క‌మార్గంలో న‌డిచివెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీ‌వారిమెట్టు మార్గంలో న‌డిచి వెళ్లేవారికి ఒక గంట‌లో ఎస్ఎంఎస్ వ‌స్తుంది. ప్ర‌స్తుతం అలిపిరి న‌డ‌క మార్గంలో పైక‌ప్పు పున‌ర్నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్న కార‌ణంగా భ‌క్తుల‌ను అనుమ‌తించ‌డం లేదు.

ఆన్‌లైన్‌లో గ‌దుల అడ్వాన్స్ రిజ‌ర్వేష‌న్ చేసుకున్న భ‌క్తుల‌కు వ‌చ్చే ఎస్ఎంఎస్‌లో ఉప విచార‌ణ కార్యాల‌యం వివ‌రాలుంటాయి. ఇలాంటి భ‌క్తులు నేరుగా సంబంధిత ఉప విచార‌ణ కార్యాల‌యానికి వెళ్లి గ‌దులు పొందొచ్చు.

అదేవిధంగా, క‌రంట్ బుకింగ్‌లో అయితే ముందుగా భ‌క్తులు పైన తెలిపిన ఆరు ప్రాంతాల్లోని ఏదో ఒక రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్‌కు వెళ్లి గుర్తింపు కార్డు చూపి పేరు న‌మోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీరికి 15 నిమిషాల్లో గ‌ది కేటాయింపు ఉప విచార‌ణ కార్యాల‌యం వివ‌రాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. భ‌క్తులు నేరుగా సంబంధిత ఉప విచార‌ణ కార్యాల‌యానికి వెళ్లి గ‌దులు పొందొచ్చు. గదుల అందుబాటు ప్రకారం భ‌క్తుల‌కు కేటాయిస్తారు.

ఈ నూత‌న విధానం ప్రారంభించిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టివ‌ర‌కు నెల రోజుల్లో 70,148 గ‌దుల‌ను భ‌క్తులు పొందారు. ఇందులో ఏఆర్‌పి ద్వారా 35,418 గ‌దులుండ‌గా, తిరుమ‌ల‌లో క‌రంట్‌ బుకింగ్ ద్వారా 34,730 గ‌దులు కేటాయించారు.

ఈ నూత‌న విధానంపై బెంగ‌ళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీ ఎం.స‌తీష్ స్పందిస్తూ పూర్తి సంతృప్తి వ్య‌క్తం చేశారు. గ‌తంలో సిఆర్‌వో కార్యాల‌యం వ‌ద్ద గంట‌ల త‌ర‌బ‌డి గ‌దుల కోసం వేచి ఉండాల్సి వ‌చ్చేద‌న్నారు. ప్ర‌స్తుతం సొంత వాహ‌నంలో అలిపిరి చెక్‌పాయింట్ వ‌ద్ద గ‌ది స్లిప్ స్కాన్ చేయించుకుని తిరుమ‌ల‌కు వ‌చ్చాన‌ని, 40 నిమిషాల్లో తాను కౌస్తుభంలో గ‌ది పొందగలిగానని తెలిపారు. టిటిడి ప్ర‌వేశ‌పెట్టిన నూత‌న విధానం స్వాగ‌తించ‌ద‌గింద‌ని చెప్పారు.

త‌మిళ‌నాడులోని శివ‌కాశికి చెందిన శ్రీ శివ‌ప్ర‌కాష‌న్ మాట్లాడుతూ ఏడుకొండ‌ల‌స్వామి తమ ఇంటి దైవమన్నారు. గ‌దుల కేటాయింపు కోసం టిటిడి యాజ‌మాన్యం ప్ర‌వేశ‌పెట్టిన విధానాల‌ను రెండు ద‌శాబ్దాలుగా ప‌రిశీలిస్తున్నాన‌ని తెలిపారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం గ‌దుల రిజిస్ట్రేష‌న్ కౌంట‌ర్ల‌ను వికేంద్రీక‌రించ‌డం మంచి ప‌ద్ధ‌తి అని స్వాగ‌తించారు. గ‌తంలో సిఆర్‌వో వ‌ద్ద భారీ క్యూలైన్ల‌లో వేచి ఉండాల్సి వ‌చ్చేద‌ని, ఈసారి అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఎంబిసి ఏరియాలో గ‌ది ల‌భించింద‌ని చెప్పారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.