VEDIC KNOWLEDGE SHOULD REACH ALL – ADDNL.EO _ వేద విజ్ఞాన ఫ‌లాల‌ను స‌మాజానికి అందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

OF 1331 SAKHAS ONLY NINE AVAILABLE NOW

TIRUPATI, 12 JULY 2021: The fruits of the vast knowledge available in our Vedas should reach everyone in the society to lead a righteous life, said TTD Additional EO Sri AV Dharma Reddy.

Addressing the Vedic fraternity on the occasion of the 15th Anniversary of Sri Venkateswara Vedic University in Tirupati on Monday, the Additional EO called on the Vedic students to take up research in an extensive manner. The treasures in Vedas need to be disseminated to the entire world for a healthy way of life. This can be possible only through extensive research. Our Vedas taught about the emergence of life, the planet, solar system and many other information related to science and geography some millions of years ago, even before science explored through innovations in the last few centuries. Though we had 1331 Veda Sakhas, only nine of them are available now. We need to safeguard and propagate this great treasure for the sake of our future generations”, he observed.

He said, the Sri Venkateswara Bhakti Channel of TTD is playing a prominent role in the propagation of Hindu Sanatana Dharma. Many programmes including Yoga Vasisthyam, Visuchika Maha Mantra Parayanam, Sundarakanda, Virata Parvam, Bhagavat Gita etc. Are all being telecasted live which received a huge response from devotees across the world. 

He invited the Vedic scholars and students of the Varsity to give religious discourses which will be telecasted live on SVBC.

NEW AGE COURSES ALSO INTRODUCED -VC

Varsity VC Sri Sannidhanam Sudarshana Sharma said, the University is putting all efforts to sustain the Vedic knowledge for the sake of next generations by creating Vedic exponents. “Apart from imparting training in the traditional Vedic knowledge, we are also giving training to our wards in Computers, English, Mathematics. Even we introduced Vedic Physics, Vedic Maths, Degree and PG courses in Sanskrit and German for the convenience of Research projects”, he added.

THE NEWSLETTER RELEASED

Iramanusha Nutrandadi book and a newsletter Veda Surabhi were released by Additional EO on the occasion. This Tamil Prabandha Raksha was translated into Telugu by the retired Special Officer of Alwar Divya Prabandha Project Sri Singaracharyulu.

SUDARSHANA HOMAM PERFORMED

Seeking world peace and also on its anniversary, Sudarshana Homam performed in the Yagashala of the varsity.

CEO SVBC Sri Suresh Kumar, Dean of the varsity Sri Subrahmanya Sharma and others were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

వేద విజ్ఞాన ఫ‌లాల‌ను స‌మాజానికి అందించాలి : టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం 15వ ఆవిర్భావ దినోత్స‌వం

తిరుపతి, 2021 జులై 12: శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యంలో ప‌రిశోధ‌న‌ల‌ను విస్తృతం చేసి వేదాల్లోని విజ్ఞానాన్ని స‌మాజానికి అందించాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుప‌తిలోని శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విశ్వ‌విద్యాల‌యం 15వ ఆవిర్భావ దినోత్స‌వం సోమ‌వారం వ‌ర్సిటీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అద‌న‌పు ఈవో మాట్లాడుతూ వేదవిద్య క్లిష్ట‌మైన‌ద‌ని, విద్యార్థులు ఎంతో సాధ‌న చేస్తేగానీ ఇందులో రాణించ‌లేర‌ని చెప్పారు. స‌మాజాన్ని స‌న్మార్గంలో న‌డిపించేందుకు దోహ‌ద‌పడే వేదవిద్య‌ను బాధ్య‌త‌గా భావించాల‌న్నారు. విద్యార్థులు వేద విద్య‌ను ప‌రిపూర్ణంగా సాధ‌న చేసి మంచి భాష‌తో ప్ర‌వ‌చ‌నాలిచ్చే స్థాయికి ఎద‌గాల‌ని సూచించారు. విద్యార్థుల చేత వారానికోసారి ప్ర‌సంగాలు ఇప్పించి సాధ‌న చేయించాల‌న్నారు.

పూర్వ‌కాలంలో వేదాల్లో 1331 శాఖ‌లుండేవ‌ని, దేశంలోని పాల‌నా ప‌రిస్థితుల కార‌ణంగా చాలాకాలం పాటు భార‌తీయులు వాటికి దూర‌మ‌య్యార‌ని అన్నారు. ప్ర‌స్తుతం 9 వేద శాఖ‌లు మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయ‌ని, వీటిలో దాగి ఉన్న సైన్స్ ర‌హ‌స్యాల‌ను వెలికితీయాల‌ని కోరారు. సూర్య‌మండ‌లం, న‌వ‌గ్ర‌హాలు, భూగోళం లాంటి అంశాలను శాస్త్రవేత్త‌లు మ‌న‌కు తెలుప‌కముందే వేదాల్లో ఉన్నాయ‌న్నారు. వేద‌శాఖ‌ల్లోని అన్ని మంత్రాల‌ను అర్థ‌తాత్ప‌ర్యాల‌తో స‌ర‌ళ‌మైన వ్య‌వ‌హారిక భాష‌లో అందించాల‌ని కోరారు. ఎస్వీబీసీలో వేదాల వ్యాప్తికి ప్రాముఖ్య‌త ఇస్తున్నామ‌ని, ఇప్ప‌టివ‌రకు ప్ర‌సార‌మైన యోగ‌వాశిష్టం-విషూచిక మ‌హామంత్ర పారాయ‌ణం, సుంద‌ర‌కాండ‌, విరాట‌ప‌ర్వం, గీతాపారాయ‌ణం కార్య‌క్ర‌మాల‌కు భ‌క్తుల నుండి విశేష‌స్పంద‌న ల‌భించింద‌న్నారు. వ‌ర్సిటీ పండితులు ముందుకొస్తే వారి ప్ర‌వ‌చ‌నాల‌ను ఎస్వీబీసీ ద్వారా ప్ర‌సారం చేస్తామ‌న్నారు.

విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ మాట్లాడుతూ వ‌ర్సిటీ ఆవిర్భావం, ప్ర‌స్థానం గురించి తెలియ‌జేశారు. వేదాల‌ను ప‌రిపూర్ణంగా అర్థం చేసుకుని, పారాయ‌ణం చేసి, వేదభాష్యం చెప్ప‌గ‌లిగే పండితుల‌ను వ‌ర్సిటీ త‌యారు చేస్తోంద‌న్నారు. వేద‌పండితుల‌కు స‌ముచిత‌మైన గౌర‌వం, అవ‌కాశాలు ల‌భించేందుకు వీలుగా కంప్యూట‌ర్, గ‌ణితం, ఆంగ్లం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు చెప్పారు. డిగ్రీస్థాయిలో వేద‌గ‌ణితం, వేదిక్ ఫిజిక్స్‌, సంస్కృతంలో డిగ్రీ, పిజి కోర్సులు, జ‌ర్మ‌న్ భాష‌లో స‌ర్టిఫికేట్ కోర్సులు ఇటీవ‌ల ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. వేదాల‌ను ప‌రిశోధించి, ప్రచురించ‌డం ద్వారా వేదాల్లోని మంచి విష‌యాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నామ‌న్నారు.

ఇరామానుశ‌నూట్రన్దాది పుస్తకం, వ‌ర్సిటీ న్యూస్‌లెట‌ర్‌ ఆవిష్క‌ర‌ణ

వర్సిటీలోని ప‌రిశోధ‌న మ‌రియు ప్ర‌చుర‌ణ‌ల విభాగం ముద్రించిన ఇరామానుశ‌నూట్రన్దాది అనే పుస్త‌కాన్ని, వేద‌సుర‌భి పేరుతో న్యూస్‌లెట‌ర్‌ను అద‌న‌పు ఈవో ఆవిష్క‌రించారు. ఇరామానుశ‌నూట్రన్దాది(ప్ర‌బంధర‌క్షా వ్యాఖ్యానువాద స‌హితం) అనే పుస్త‌కం నాళాయిర దివ్య‌ప్ర‌బంధంలోని పాశురాల‌కు వ్యాఖ్యానం. టిటిడి ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు విశ్రాంత ప్ర‌త్యేకాధికారి శ్రీ శింగ‌రాచార్యులు ఈ ప్ర‌బంధ ర‌క్షా త‌మిళ వ్యాఖ్యానాన్ని య‌థాత‌థంగా తెలుగులోకి అనువ‌దించారు.

శాస్త్రోక్తంగా సుద‌ర్శ‌న హోమం

వ‌ర్సిటీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా వ‌ర్సిటీ అభివృద్ధి, లోక‌క్షేమాన్ని కాంక్షిస్తూ ఉద‌యం యాగ‌శాల‌లో శాస్త్రోక్తంగా సుద‌ర్శ‌న హోమం, న‌వ‌గ్ర‌హ హోమం, న‌వ‌గ్ర‌హ పూజ నిర్వ‌హించారు. ఆచార్య శ్రీ‌నివాసాచార్యులు ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఉప‌కుల‌ప‌తి ఆచార్య స‌న్నిధానం సుద‌ర్శ‌న‌శ‌ర్మ, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబీసీ సిఈవో శ్రీ జి.సురేష్‌కుమార్‌, వ‌ర్సిటీ అక‌డ‌మిక్ డీన్ శ్రీ జివి.సుబ్ర‌హ్మ‌ణ్య శ‌ర్మ, ఆచార్యులు శ్రీ ప‌వ‌న‌కుమార శ‌ర్మ, ఇత‌ర ఆచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.