ACTION PLAN FOR THE DEVELOPMENT OF UPAMAKA TEMPLE _ ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు
Tirumala, 17 February 2025: TTD Chairman Sri. BR Naidu told the Honourable Home Minister of AP Smt. Vangalapudi Anita that steps will be taken immediately towards the development of Sri Venkateswara Swamy temple located in Upamaka of Nakkapally Mandal in Anakapally district.
The state Home Minister, who visited Tirumala for Srivari darshan, has formally met the TTD Chairman in the latter’s camp office on Monday.
She informed the Chairman that the ancient temple which was spread over an area of five acres, was handed over to TTD in 2017 and its development was ignored in the last five years.
She said the TTD Chairman should focus on the development of Upamaka temple and glorify its reputation.
Reacting positively, the TTD Chairman said that steps will be initiated and directed the officials concerned to come out with an action plan on the same without further delay.
TTD EO Sri J. Syamala Rao, TTD Board member Sri. MS Raju, CE Sri Satya Narayana were also present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు
తిరుమల, 2025 ఫిబ్రవరి 17: అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో ఉన్న ఉపమాక శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతామని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఏపీ హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనితతో అన్నారు.
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఏపీ హోం మంత్రి దర్శనానంతరం టీటీడీ చైర్మన్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి ఉపమాక ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అత్యంత ప్రాశస్త్యం గల ఉపమాక ఆలయాన్ని 2017లనే టీటీడీకి అప్పగించడం జరిగిందని చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఉపమాక ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకురావాలని చైర్మన్ కు తెలియజేశారు.
ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన చైర్మన్ ఆలయ అభివృద్ధికి తగు చర్యలు చేపడతామని ఆమెకు తెలిపారు.
ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఎం.ఎస్.రాజు, సీఈ శ్రీ సత్య నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.