ANKURARPANAM HELD _ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

TIRUMALA TIRUPATI DEVASTHANAMS

ANKURARPANAM HELD

Tirupati, 17 February 2025: The nine-day annual Brahmotsavam festivities at Srinivasa Mangapuram commenced with the ritual of prelude Ankurarpanam on Monday evening.

From 6pm to 8pm Punyahavachanam, Mritsangrahanam and Senadhipati Utsavam before observing Beejavapanam were conducted as per the tenets of Vaikhanasa Agama Shastra.

Special Grade Deputy EO of the temple Smt. Varalakshmi, AEO Sri. Gopinath, Superintendent Sri. Ramesh, temple priests and other officials participated in this program.

Impressive floral and electrical decorations along with Annaprasadams have been arranged for the devotees.

Dhwajarohanam on February 18

The Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy will begin on February 18 with the ceremonious Dhwajarohanam in the auspicious Meena Lagnam.  

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

– బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

తిరుప‌తి, 2025 ఫిబ్ర‌వ‌రి 17: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణం సందర్భంగా సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్‌ శ్రీ ర‌మేష్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయ ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాటుచేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. భక్తులకు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు.

భక్తులకు అన్నప్రసాదాలు :

బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టిటిడి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది. వాహనసేవల సమయంలో భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, పాలు, తాగునీరు అందించనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్ర‌సాదాలు ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు భక్తులకు అందుబాటులో ఉంచారు. భక్తులకు వైద్యసేవలు అందించేందుకు వైద్యశిబిరం ఏర్పాటుచేశారు.

ఆకట్టుకునేలా అలంకరణలు :

బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ఆలయం, పరిసర ప్రాంతాల్లో భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు అలంకరణకు సంబంధించి మొత్తం 3 టన్నుల పుష్పాలను వినియోగించనున్నారు. ఇందులో సంప్రదాయ పుష్పాలతో పాటు విదేశీజాతుల పుష్పాలు కూడా ఉన్నాయి. వాహనసేవల్లో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించనున్నారు. దేవతామూర్తుల విద్యుత్‌ కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.

ఫిబ్రవరి 18న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 18వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 8.15 నుండి 8.40 గంటల మధ్య మీన‌ల‌గ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

18-02-2025

ఉదయం – ధ్వజారోహణం (మీన‌ల‌గ్నం)

రాత్రి – పెద్దశేష వాహనం

19-02-2025

ఉదయం – చిన్నశేష వాహనం

రాత్రి – హంస వాహనం

20-02-2025

ఉదయం – సింహ వాహనం

రాత్రి – ముత్యపుపందిరి వాహనం

21-02-2025

ఉదయం – కల్పవృక్ష వాహనం

రాత్రి – సర్వభూపాల వాహనం

22-02-2025

ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)

రాత్రి – గరుడ వాహనం

23-02-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – స్వర్ణరథం,

రాత్రి – గజ వాహనం

24-02-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

రాత్రి – చంద్రప్రభ వాహనం

25-02-2025

ఉదయం – రథోత్సవం

రాత్రి – అశ్వవాహనం

26-02-2025

ఉదయం – చక్రస్నానం

రాత్రి – ధ్వజావరోహణం

ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.