ADD. EO REVIEWS RAMAKRISHNA THEERTHA MUKKOTI ARRANGEMENTS _ శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

TIRUMALA, 08 FEBRUARY 2025: The Additional EO of TTD Sri Ch Venkaiah Chowdary reviewed the arrangements for the upcoming Sri Ramakrishna Theertha Mukkoti which is scheduled for February 12.

The review meeting was held at Gokulam Rest House in Tirumala on Saturday.

The Additional EO directed the concerned sign boards at GNC, bus station, Octopus circle, Papavinashanam Dam along with route map pilgrims at every distance of 1 km.

He also asked that continuous announcements with respect to cautioning devotees who are aged, physically challenged, obese and children below 10years to avoid trekking the Theertham path.

He also reviewed the arrangements of ropes, ladders with supporting sides to climb, a sufficient number of taps from Papavinasanam to Ramakrishna Theertham, ambulances, Annaprasadam packets distribution, provision of water, security measures and many other facilities to be made for the pilgrims trekking the torrent located in the deep woods.

To avoid traffic congestion and for the safety of pilgrims, the APSRTC has arranged buses for the transportation of devotees from the Gogarbham Dam to the Papavinasanam Dam.

The devotees will also be allowed to trek the torrent from 5am till 12noon on February 12.

Srivari Sevaks will render Annaprasadam service to the devotees at Papavinasanam.

EE Sri Subramanyam, VGO Sri Surendra, DFO Sri Srinivas and other staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

తిరుమల, 2025 ఫిబ్రవరి 08: తిరుమలలో ఫిబ్రవరి 12వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో  శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి శుక్రవారం తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు మాట్లాడుతూ, తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో ఒకటైన రామకృష్ణతీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల కోసం షామియానా, రేడియో బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతాసిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, తాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పాపవినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు.

అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించబోమని తెలియజేశారు. తీర్థం వద్ద పూజలు సకాలంలో పూర్తి చేయాలని ఆలయ సిబ్బందిని ఆదేశించారు.

కాగా, గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ నుండి బస్సులను ఏర్పాటు చేసెలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించనున్నట్లు తెలిపారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.