SRI KALYANA VENKATESWARA SWAMY TEPPOTSAVAMS _ తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం
Tirupati, 08 Tirupati 2025: As part of Sri Govindaraja Swamy Teppotsavam, on the third day on Saturday, Sri Kalyana Venkateswara Swamy took out a celestial ride on Teppa to bless his devotees from 6.30 pm to 8 pm, in five rounds.
Similarly, Sri Krishna Swamy will bless the devotees on Teppa along with Andal Ammavaru on Sunday.
On this occasion, Bhajans, Harikatha and music programs were organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad and Annamacharya Project of TTD.
Sri Sri Sri Pedda Jeeyar Swamy, Sri Sri Chinna Jeeyar Swamy, Deputy EO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, other officials and a large number of devotees participated in the Teppotsavam.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి కటాక్షం
తిరుపతి, 2025 ఫిబ్రవరి 08: శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తెప్పపై విహరించారు అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.
పుష్కరిణిలో స్వామివారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అదేవిధంగా ఆదివారం ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు
తెప్పోత్సవాల్లో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునిక్రిష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.