ADDITIONAL EO INSPECTS _ తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలు

TIRUMALA, 08 NOVEMBER 2024: TTD Additional EO Sri Ch Venkaiah Chowdary inspected the ongoing construction works of PAC 5 in Tirumala on Friday evening.

As a part of it he visited all halls, tonsure area, dining area, bathrooms, electrical wiring, corridor and observed the elevation designs.

He later instructed the officials concerned to complete the works by the year end. The building should come for pilgrim utility by Jan next and there should be no further delay in works”, he observed.

CE Sri Satyanarayana, DyEO Sri Harindranath and others were present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో అడిషనల్ ఈవో తనిఖీలు

తిరుమల, 2024 నవంబరు 08: తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని శుక్రవారం సాయంత్రం టీటీడీ అడిషనల్ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తనిఖీ చేశారు.

భవనంలో ఏర్పాటు చేస్తున్న కల్యాణ కట్ట, భోజనశాల, మరుగుదొడ్లు, విద్యుత్ వైరింగ్, హాళ్లను పరిశీలించారు.

ఈ ఏడాది చివరిలోపు పనులను పూర్తి చేసి జనవరి నెలలోపు భవనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కాకూడదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.