TTD CHAIRMAN VISITS DHARMAGIRI AND GOSHALA _ ధర్మగిరి, గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్

Tirumala, 08 November 2024: TTD Trust Board Chairman Sri BR Naidu visited Dharmagiri Veda Vignana Peetham and SV Gosala in Tirumala on Friday evening.

Earlier on his maiden arrival to Dharmagiri, the Principal Sri KSS Avadhani accorded him traditional welcome amidst vedic chants and Aseervachanam.

Later the TTD Board Chief interacted with students and said 

all the students should expertise in their courses and preach Sanatana Dharma.

”If there are any issues we are here to resolve it and I will meet you all again. Our noble intention is to take forward Sanatana Dharma to newer heights, he asserted.

In the beginning, Dharmagiri Principal briefed the TTD Board Chief about the emergence and prominence of the vedic institution in Tirumala.

Special Officer Dharmagiri Smt Vijayalakshmi, Health Officer Dr Madhusudhana Prasad and others were also present.

Gosala 

Afterwards, the TTD board chief visited Gosala and participated in Navaneeta Seva.

He observed the services rendered by Srivari Sevaks in Navaneeta Seva and also handed over the butter that is churned out of buttermilk which is used for Ekanta Seva to the sevaks. He also took part in Gopuja. SV Gosala Director Dr Harnath Reddy was also present.

Later the Chairman visited Sri Pedda Jeeyar Mutt and took the blessings of HH Sri Pedda Jeeyar Swamy and also worshipped to Sri Bedi Anjaneya Swamy and offered coconuts in Akhilandam.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధర్మగిరి, గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్

తిరుమల, 2024 నవంబరు 08: తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ గోశాలను శుక్రవారం సాయంత్రం టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు సందర్శించారు.

ధర్మగిరికి తొలిసారిగా వచ్చిన సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్‌ఎస్ అవధాని టిటిడి ఛైర్మన్ కు వేద మంత్రోచ్ఛారణలు నడుమ వేదాశీర్వచనం నిర్వహించి సంప్రదాయ పూర్వకంగా స్వాగతం పలికారు.

అనంతరం విద్యార్థులతో శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడారు.
విద్యార్థులందరూ తమ కోర్సులలో నైపుణ్యం సాధించి సనాతన ధర్మాన్ని ప్రబోధించాలని కోరారు.

”ఏదైనా సమస్యలను తాము పరిష్కరిస్తామని, మరోసారి విద్యార్థులందరిని కలుస్తానన్నారు. సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళాలన్నదే తమ ఉదాత్తమైన సంకల్పమని ఆయన పేర్కొన్నారు.

తొలుత ధర్మగిరి ప్రధానోపాధ్యాయులు తిరుమలలో వైదిక సంస్థ ఆవిర్భావం, ప్రాభవం గురించి టీటీడీ ఛైర్మన్ కి వివరించారు.

ప్రత్యేక అధికారి ధర్మగిరి శ్రీమతి విజయలక్ష్మి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలోని గోశాలను సందర్శించిన ఛైర్మన్

అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు గోశాలను సందర్శించి నవనీత సేవలో పాల్గొన్నారు.

నవనీత సేవలో శ్రీవారి సేవకులు చేస్తున్న సేవలను ఆయన పరిశీలించారు, ఏకాంత సేవకు వినియోగించే వెన్నను తయారు చేసే విధానాన్ని పరిశీలించారు, గోపూజలో కూడా ఛైర్మన్ పాల్గొన్నారు. ఎస్వీ గోసాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

పెద్ద జీయర్ మఠం సందర్శన

శ్రీ పెద్ద జీయర్ మఠాన్ని టిటిడి ఛైర్మన్ సందర్శించి శ్రీ పెద్ద జీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అఖిలాండంలో శ్రీ బేడి ఆంజనేయ స్వామికి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.