ADDITIONAL EO INSPECTS _ తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు

Tirumala, 25 August 2024: The TTD Additional EO Sri Ch Venkaiah Chowdhary on Sunday inspected four Mada streets and Laddu counters along with the temple DyEO Sri Lokanatham and other officials.

As a part of his inspection, he verified the exit and entry points during the ensuing annual Brahmotsavams, especially on the day of Garuda seva.

Later he also inspected the Laddu Prasadam Complex to ensure the distribution of laddus in a congenial environment to the pilgrims when the rush is heavy and made some valuable instructions to the officers concerned.

VGO Security Sri Surendra, temple AVSO Sri Manohar were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు

తిరుమల, 2024 ఆగష్టు 25: తిరుమలలో ఆలయ నాలుగు మాడ వీధులు, లడ్డూ కౌంటర్లను ఆదివారం టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.

ఇందులో భాగంగా అక్టోబర్ 4 నుండి జరుగునున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడ సేవ రోజున లక్షలాదిగా విచ్చేసే భక్తుల ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు.

అనంతరం లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌ను పరిశీలించి, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో అధిక సమయం వేచి ఉండకుండా, త్వరితగతిన లడ్డూలను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

అదనపు ఈవో వెంట విజిఓ శ్రీ సురేంద్ర, ఆలయ ఎవిఎస్ఓ శ్రీ మనోహర్ తదితరులు ఉన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.