MOCK DRILL PERFORMED AT TIRUCHANOOR _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్

Tirupati, 25 August 2025: As a part of its regular activity, a mock drill was carried out by TTD cops with the Octopus team in Sri Padmavati temple at Tiruchanoor during the wee hours on Sunday.

Usually, TTD carries out this mock drill to ensure its preparedness to counter any anti-social element attack and deal swiftly with any emergency situation.

VGO Tirupati Sri Nandakishore, AVSO Sri Satish and others were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్

తిరుప‌తి, 2024 ఆగష్టు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున టిటిడి విజిలెన్స్ సిబ్బంది మరియు ఆక్టోపస్ దళం మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఉగ్రవాదులు చొరబడినప్పుడు, ఏదేని అత్యవసర పరిస్థితులు వాటిల్లినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, భక్తులను ఎలా రక్షించాలి అనే విషయాలను మాక్ డ్రిల్ ద్వారా చేసి చూపారు.

ఆక్టోపస్ దళాలు రాష్ట్రంలోని వివిధ ప్రముఖ స్థలాలు, ఆలయాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఏటా మాక్ డ్రిల్స్ నిర్వహించడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో విజివో శ్రీ నందకిషోర్, ఏవీఎస్వో శ్రీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.