ADDITIONAL EO REVIEWS ON NAVANEETHA SEVA _ నవనీత సేవపై అదనపు ఈఓ సమీక్ష

Tirumala, 18 August 2021:  As part of its noble mission to promote and protect indigenous cow breeds, TTD is all set to commence a new Seva, Navaneetha Seva on the auspicious day of Sri Krishna Janmashtami on August 30.

A review meeting over the arrangements to be made for the same was held by the Additional EO Sri AV Dharma Reddy with the officials concerned at Tirumala Gosala on Wednesday evening.

The Additional EO said Navaneetha Seva is a unique one as fresh butter from Desi cows will be offered to Srivaru every day. “Everyday evening the butter extracted afresh churned out of the buttermilk afresh in a traditional manner from these Desi Cow breeds will be taken in a procession from Tirumala Gosala to Srivari temple and is handed over to the religious staff which will be used during the daily Kainkaryams of the following day”, he maintained.

He later instructed the civil, electrical and water works to be completed before August 25 in Tirumala Gosala. The services of over a dozen volunteers will also be used in SV Gosala at Tirumala for this Seva and necessary training will be imparted to them.

The Additional EO said a trial run of the Navaneetha Seva will be commenced from August 25 onwards before it is launched in a full-fledged manner on August 30″, he added.

Later, all the officers visited the 25 Gir breed cows which were donated to Tirumala SV Gosala of TTD.

Chief Priest Sri Krishna Seshachala Deekshitulu, former TTD Board member and Sri Siva Kumar, SE2 Sri Jagadeeshwar Reddy, DyEOs Sri Ramesh Babu, Sri Harindranath, Sri Vijayasaradhi, Additional Health Officer Dr Sunil, EE 1 Sri Jaganmohan Reddy, DE Sri Ravishankar Reddy, Dairy farm Doctor, Dr Nagaraju, OSD Sri P Seshadri were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నవనీత సేవపై అదనపు ఈఓ సమీక్ష

తిరుమల, 18 ఆగస్టు 2021: శ్రీవారికి వెన్న సమర్పించేందుకు ఉద్దేశించిన నవనీత సేవ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి బుధవారం తిరుమలలోని గోశాలలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు ఈఓ మాట్లాడుతూ మహాభారతంలో పేర్కొన్నట్టు చిన్నికృష్ణుడి కోసం యశోధ మజ్జిగ చిలికి వెన్న తీసిన విధంగా సంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమం జరగాలన్నారు. ఆగస్టు 30న గోకులాష్టమి సందర్భంగా నవనీత సేవను లాంఛనంగా ప్రారంభించనున్నామని, ఆగస్టు 25వ తేదీలోపు ఇందుకు అవసరమైన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మజ్జిగ చిలికి వెన్న తీసేందుకు మహిళా సేవకులను ఆహ్వానించాలని కోరారు. గోశాలలో వెన్న తీసిన అనంతరం సేవకులు ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద అర్చకులకు అప్పగిస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, మాజీ బోర్డు సభ్యులు శ్రీ శివకుమార్, డెప్యూటీ ఈఓలు శ్రీ రమేష్ బాబు, శ్రీ విజయసారథి, శ్రీ హరీంద్రనాథ్, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సునీల్, గోశాల వెటర్నరీ డాక్టర్ డా.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.