DOSHA NIVARANA UTSAVAM-THE “SIN-FREE” FESTIVAL COMMENCES IN TIRUMALA _ శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

ANNUAL PAVITROTSAVAMS REVIVED BY TTD IN 1962

Tirumala, 18 August 2021: The three-day annual festival of Pavitrotsavams, also known as Dosha Nivarana, Sarvadoshopasamana, Sarva Yagna Phalaprada, Sarva Tustikara, Sarva Kamaprada festival commenced in Tirumala temple on Wednesday.

Every year, TTD celebrates Pavithrotsavam on the important days of Ekadasi, Dwadasi and Trayodasi in the auspicious month of Sravana as per Hindu calendar. Saluva Mallaiah Deva Raja first instituted this festival in 1463 AD at Tirumala during the period of Saluva Narasimha as per the inscription 157 present in Srivari Temple.

Earlier in the morning, Snapana Tirumanjanam was performed to the utsava deities of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi amidst chanting of Vedic mantras followed by Pavitramala Visesha Samarpana. In the evening, the deities will be taken around four mada streets in a procession and in the night Vedic rituals will be performed in yagashala between 7pm and 10pm.

The significance of the festival is that the priests symbolically seek the pardon of Sri Venkateswara Swamy for their acts of all omissions and commissions committed either knowingly or unknowingly during the performance of daily rituals to the presiding deity inside the temple all through the year.

Additional EO Sri AV Dharma Reddy, Temple DyEO Sri Ramesh Babu and other temple staff were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2021 ఆగ‌స్టు 18: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల పవిత్రోత్సవాలు బుధ‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుంగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మ‌ధ్యాహ్నం 3 గంటలకు స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేస్తారు.

అనంతరం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.