ADDITIONAL EO REVIEWS ON TRANSIT ACCOMMODATION _ తిరుమ‌ల‌లో తాత్కాలిక విరామ వ‌స‌తిపై అధికారుల‌తో స‌మీక్షించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 19 Mar. 20: With an aim to facilitate more accommodation to pilgrims in Tirumala, the Additional EO Sri AV Dharma Reddy on Thursday reviewed on Transit Accommodation that is being provided to various outside departments.

The officials from Railways, APSRTC, AP Tourism, Police and TTD Vigilance took part in this review meeting which was held at Gokulam Conference Hall.

The Additional EO directed the Estate Officer of Tirumala, to take back the accommodation which are provided in excess to various outside wings and instructed the Reception Wing DyEOs to allot them to pilgrims. 

Additional CVSO Sri Sivakumar Reddy, VGOs Sri Manohar, Sri Prabhakar, Estates Officer Sri Vijaya Saradhi, DyEOs Sri Balaji, Sri Damodaram and officers from various outside departments participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

తిరుమ‌ల‌లో తాత్కాలిక విరామ వ‌స‌తిపై అధికారుల‌తో స‌మీక్షించిన అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2020 మార్చి 19: తిరుమ‌ల‌కు విచ్చేసే వేలాది మంది భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించ‌డంలో భాగంగా అద‌న‌పు గ‌దులు అందుబాటులోనికి తీసుకురావాల‌ని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమ‌లోని గోకులం విశ్రాంతి భ‌వ‌నంలోని స‌మావేశ మందిరంలో గురువారం ఉద‌యం అద‌న‌పు ఈవో పోలీస్‌, విజిలెన్స్‌, టూరిజం, రైల్వే, ఎపిఎస్ ఆర్‌టిసి శాఖ‌ల‌కు కేటాయించిన గ‌దుల‌పై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తిరుమ‌ల‌లో వివిధ ప్ర‌భుత్వ విభాగాల‌కు తాత్కాలిక విరామ వ‌స‌తి కొర‌కు అవ‌స‌రానికి మించి కేటాయించిన గ‌దుల‌ను తిరిగి టిటిడికి ఇవ్వాల‌ని సంబంధిత అధికారులకు సూచించారు. త‌ద్వారా మ‌రింత ఎక్క‌వ మంది భ‌క్తులు తిరుమ‌ల‌లో బస చేయ‌వ‌చ్చాన్నారు. అద‌న‌పు వ‌స‌తి గ‌దుల‌ను భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావాల‌ని టిటిడి ఎస్టేట్‌, వ‌స‌తి విభాగాల అధికారులను ఆదేశించారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఎస్టేట్ అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, రిసెప్ష‌న్ డెప్యూటీ ఈవోలు శ్రీ బాలాజి, శ్రీ దామోద‌రం, విజివోలు శ్రీ మ‌నోహ‌ర్‌, శ్రీ ప్ర‌భాక‌ర్‌, పోలీస్‌, విజిలెన్స్‌, టూరిజం, రైల్వే, ఎపిఎస్ ఆర్‌టిసి అధికారులు పాల్గొన్నారు.          

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.