TTD TO STALL DARSHAN FOR PILGRIMS FROM MARCH 20 ONWARDS FOR A WEEK AS OF NOW _ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

ARCHAKAS WILL PERFORM KAINKARYAMS AS USUAL IN EKANTHAM 

BOTH FOOT PATHS CLOSED ON MARCH 19 ITSELF

 COVID 19 SUSPECT IDENTIFIED IN TIRUMALA

TTD TAKES IMMEDIATE PRECAUTIONS UNDER THE INSTRUCTIONS OF GOVERNMENT

Tirumala, 19 March 2020: In view of containing the widely spreading COVID-19 virus, TTD has decided to stall Srivari darshan with effect from March 20th from 12 noon onwards for pilgrims. However all the daily Kainkaryams will be performed to the main deity by Archakas as usual, said TTD EO Sri Anil Kumar Singhal.

Addressing media persons at Annamaiah Bhavan at Tirumala on Thursday evening along with Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Tirupati Urban SP Sri Ramesh Reddy he said, TTD will allow pilgrims with Time slot tokens, VIP break darshan tickets and Friday Arjitha Sevas for darshan which were already issued on Thursday till 12 noon of Friday, on March 20.

TTD decision to stop Srivari darshan is for a period of seven days for now is under the directives from State Government in view of a COVID 19 suspect who visited Tirumala on March 18.

He said TTD board chairman will review all decisions depending on fresh guidelines from State and central Governments after seven days.

Temporarily other TTD local temples like Sri Padmavati Ammavari Temple at Tiruchanoor, Sri Govinda Raja Swamy Temple and others also will be closed. Even the Brahmotsavams in Sri Kodandarama Swamy temple at Tirupati will be conducted in side in a low profile. While we have already cancelled mass Sita Rama Kalyanam at Vontimitta on April 7, he mentioned. 

ON COVID 19 SUSPECTED PILGRIM

Elaborating on the COVID 19 suspected case, Sri Daya Shankar, 65 years of age from Mirzapur in Uttar Pradesh in a team of 110 had pilgrimage visiting Triveni Sagam at Allahabad, Kolkata, Puri Jagannath, and Srisailam and reached Tirumala on March 18 and stayed in Madhava Nilayam.

The patient is suffering from Chronic Obstructive Pulmonary Disease (COPD) from the past two decades.  He, along with his group, are now kept in Isolation Ward for treatment. Exact reports about his health condition will be come to us soon, EO said.

PRECAUTIONARY MEASURES BY TTD

As a matter of precautionary measure, both the foot paths at Alipiri and Srivari Mettu were shut down from today itself by 3pm onwards and devotees with time slot tokens alone permitted to walk up Tirumala. The EO said on March 19 a total of 42, 957 time slot tokens were issued to pilgrims and they will be provided darshan by the end of the day.

Adding further he said all Reception counters, Kalyanakatta, Anna Prasadam Complex, Laddu Complex are set to close down from 12 noon of March 20. 

To a query he said, there were a few instances when similar incidences took place in temple history. Citing 1892 incident, he said, during that time was completely closed for two days.

The EO appealed to devotees to bear with this inconvenience and urged them co operate with the decisions of TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం – టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌

తిరుమల, 2020 మార్చి 19L ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజురోజుకూ  ఉధృతంగా విస్త‌రిస్తున్న క‌రోనా (కోవిడ్ 19) వైర‌స్‌ను అరికట్ట‌డంలో భాగంగా శ్రీ‌వారి ఆల‌యంలోకి మార్చి 20వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం నుండి వారం రోజుల పాటు భ‌క్తుల‌ ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం సాయంత్రం ఈవో, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డితో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆదేశాల‌ మేర‌కు, భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని  గౌ.ముఖ్య‌మంత్రి వ‌ర్యులు శ్రీ వై.య‌స్‌. జగన్ మోహ‌న్ రెడ్డి, టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డిలతో సంప్రదించి  శ్రీవారి ఆలయంలోకి భక్తుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు తెలిపారు.ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులందరికీ   శ్రీవారి దర్శనం కల్పించి అనంతరం ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తామ‌న్నారు.  ప్రతి నిత్యం స్వామివారికి నిర్వహించే నిత్య కైంకర్యాలను అర్చ‌కులు ఏకాంతంగా నిర్వ‌హిస్తార‌న్నారు.

ముందుజాగ్ర‌త్త‌గా అలిపిరి మ‌రియు శ్రీ‌వారి మెట్టు మార్గాలను గురువారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి మూసివేయ‌డం జ‌రిగింద‌న్నారు. స‌మ‌య నిర్దేశిత టోకెన్లు, విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం మ‌రియు శుక్ర‌వార‌పు ఆర్జిత సేవాటికెట్లు పొందిన భ‌క్తుల‌ను మాత్ర‌మే ఈ రోజు ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తార‌న్నారు. తిరుమల ఘాట్ రోడ్లు, కళ్యాణకట్ట, వ‌స‌తి గృహ‌లు, అతిథి భ‌వ‌నాలు, యాత్రికుల వ‌స‌తి స‌మూదాయాలు, అన్న ప్రసాద కేంద్రాలను శుక్ర‌వారం తిరుమ‌ల నుండి భ‌క్తులను త‌ర‌లించిన త‌రువాత మూసి వేయ‌నున్న‌ట్లు తెలిపారు. పూర్వ‌కాలంలో ఉప‌ద్ర‌వాలు, ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌పుడు, శ్రీ‌వారి ఆల‌య‌ మ‌హ‌ద్వారంలో ఉన్న జ‌డివాకిలి ద్వారా అర్చ‌క‌స్వాములు లోనికి ప్ర‌వేశించి స్వామివారి కైంక‌ర్యాలు నిర్వ‌హించిన‌ట్టు చ‌రిత్ర చెబుతోంది. టిటిడి వ‌ద్ద ఉన్న రికార్డుల ప్ర‌కారం గతంలో 1892 లో రెండు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేసిన‌ట్లు తెలియ‌జేశారు.

ఉత్తర ప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాకు చెందిన 130 మంది భక్తులు తీర్థయాత్రలో భాగంగా అలహాబాద్,  వారణాసి, కలకత్తా, పూరిల మీదుగా ఒంగోలు చేరుకుని, శ్రీశైలం వెళ్లి నిన్న మధ్యాహ్నం తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నార‌న్నారు. ఇందులో ద‌యాశంక‌ర్ అనే 65 ఏళ్ల వృద్ధిడికి కరోనా లక్షణాలు కనిపించడంతో తిరుపతి రూయాకు తరలించి ప‌రిక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. అత‌నికి గ‌త 20 సంవ‌త్స‌రాలుగా క్రానిక్ అబ్ట్స్ర‌క్టివ్‌ పల్మనరీ డిసీజ్ ( సిఓపిడి ) దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి ఉన్న‌ట్లు వైద్యులు తెలియ‌జేశార‌న్నారు.  
 
ఇప్ప‌టికే దేశంలోని ప్ర‌ముఖ ఆల‌యాలైన మ‌హారాష్ట్ర‌లోని షిర్డి, జ‌మ్మూలోని శ్రీ వైష్ణ‌వీ మాత ఆల‌యాల‌ను మూసివేసిన‌ట్లు తెలిపారు. టిటిడి ఆగ‌మ పండితుల‌తో చ‌ర్చించి స్థానిక ఆల‌యాలైన తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యాల‌లో ఉగాది ఆస్థానం, మార్చి 22 నుండి నిర్వ‌హించ‌వ‌ల‌సిన శ్రీ కోదండ‌రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు, మార్చి 20వ తేదీ శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో నిర్వ‌హించ‌నున్న పుష్ప‌యాగంను ఆయా ఆల‌యాల లోప‌ల నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం వేదికను రద్దు చేసి ఆల‌యంలో ఏకాంతంగా కళ్యాణాన్ని నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుటుండటంతో ప్రభుత్వంతో సంప్రదించి భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్ఠిలో ఉంచుకుని త‌గు నిర్ణయం తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం మేర‌కు టిటిడి విద్యాసంస్థ‌ల‌ను మార్చి 31వ తేదీ వ‌ర‌కు ముసివేసిన‌ట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులపై సమీక్షిస్తోంద‌ని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.  

టిటిడి స్థానిక ఆల‌యాలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం –

టిటిడి స్థానిక ఆల‌యాలైన తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యం, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, ఇత‌ర అనుబంధ ఆల‌యాల‌లో భ‌క్తుల ప్రవేశాన్ని వారం రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం

ఈ స‌మావేశంలో తిరుప‌తి అర్బ‌న్ ఎస్పి శ్రీ ర‌మేష్‌రెడ్డి, టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.  

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.