ALL SET FOR HOMA MAHOTSAVAMS IN KAPILA THEERTHAM _ న‌వంబరు 2 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు

Tirupati, 01 November 2024: All is set to observe the month-long Karthika Homa Mahotsavams at Sri Kapileswara Swamy temple from November 2-December 1.

From November 2 to 4, first the Homa of Sri Ganapati Swami will be performed followed by the Homa of Sri Subramanya Swamy from November 5 to. Later the Homa of Sri Dakshinamurthy on November 8 and the Navagraha Homa will be held on November 9.

Similarly, from November 10 to 18, Sri Kamakshi Ammavari Homam (Chandi Homam), from November 19 to 29, Sri Kapileswara SwamyHomam (Rudra Homam), on November 30, Sri Kalabhairava Homam, on December 1, Sri Chandikeswara Homam will be observed followed by Trisulasanam and Panchamurtula Tiruveedhi Utsavam.

Grihastas (two persons) can participate on one-day homa with a ticket of Rs.500/- and beget an Uttariyam, a blouse piece.

Wearing traditional attire to participate in Homam is mandatory.

As part of Mahotsavam the sacred Kalyanotsavam of Sri Subramanya Swamy along with Sri Valli and Devasena will be held on November 7 and Kalyanotsavam of Sri Siva Parvati will also be held on November 29.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వంబరు 2 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయంలో కార్తీకమాస విశేష పూజ హోమ మహోత్సవాలు

తిరుపతి, 2024 నవంబరు 01: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోకకల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబరు 2 నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. న‌వంబరు 2వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది.

నవంబరు 2 నుంచి 4వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, నవంబరు 5 నుండి 7వ‌ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, నవంబరు 8న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం, నవంబరు 9న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.

అదేవిధంగా నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారిహోమం(చండీహోమం), నవంబరు 19 నుంచి 29వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు 30న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, డిసెంబరు 1న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది.

ఈ హోమాల్లో భాగంగా నవంబరు 7న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, నవంబరు 29న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి.

హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ :

శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది. ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.