SPECIAL FESTIVALS AT SRI KODANDARAMA SWAMY TEMPLE IN NOVEMBER _ న‌వంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 01 November 2024: The series of special events lined up at Sri Kodandarama Swamy Temple in Tirupati in the month of November. 

  On all Saturdays of November viz. 2, 9, 16, 23 and 30, the Abhishekam of the main deities of Sri Rama, Sita and Lakshmana will be held at 6 am, and in the evening the procession will be held followed by the Unjal Seva.

Devotees can participate in the abhishekam of the main deities by paying Rs. 20/-.

  On November 15, the Ashtottara Shatakalashabhishekam will be held at 8.30 am on the occasion of the full moon day.  At 5.30 pm, the Tiruchi Utsavam will be held in the Maha streets of the temple followed by the Asthanam at 6.30 pm.

  On November 20, on the occasion of Punarvasu Nakshatram, the Kalyanotsavam of Sri Sita Rama will be held at 11 am. Grihastas (two) can participate in this Kalyanotsavam by paying Rs.500/-. At 5.30 pm, the Tiruchi Utsavam will be held and in Sri Ramachandra Pushkarini, Unjal Seva will be held.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

న‌వంబరులో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2024 నవంబరు 01: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో న‌వంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

•⁠ ⁠న‌వంబరు 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు.

– న‌వంబరు 15న పౌర్ణమి సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు ఆస్థానం చేపడతారు.

•⁠ ⁠న‌వంబరు 20న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.