AMBEDKAR – A MODERN SOCIAL GURU -TTD JEO (E&H) _ ఆధునిక సమాజ గురువు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ : జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి

Tirupati 14 April 2022:TTD JEO (Education & Health) Smt Sada Bhargavi said that Dr B R Ambedkar has taught Hindu Dharmic values like Sri Dattatreya Swami and Sri Adi Shankaracharya and is fittingly hailed as a Modern Social Guru.

Participating as chief guest in the 131st Jayanti Utsav of Dr BR Ambedkar at Mahati auditorium, the TTD JEO lauded him as a messiah who arrived for the upliftment of the poor, backward sections of society.

Referring sankeetan of Annamacharya “Brahmam Okkate Parabrahmam Okkate” she highlighted the message that all human beings are equal.

Acharya M Ravikumar of SV University Telugu department giving various instances said Ambedkar’s philosophy and preachings have really transformed the society and the empowerment of all downtrodden sections to a great extent.

Smt Padmaja leader of Ambedkar Dharma Porata Samiti hailed Ambedkar as a global thinker whose life suffered numerous humiliations but lived a respectable lifestyle and took Gautam Buddha, Kabir and Jyotiba Phule as his guides.

Thereafter several TTD employees also spoke and highlighted several life facets of Ambedkar.

Several TTD employees were presented Silver dollars and mementos and also winners of essay, quiz contests on Ambedkar were given presentations.

DyEOs Sri Damodaram, Sri Subramaniam, Sri Devendra Babu, Smt Jagadiswari, BC liaison officer Dr Bharat Kumar and large number of TTD employees were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

ఆధునిక సమాజ గురువు డా. బాబాసాహెబ్ అంబేద్కర్ : జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2022 ఏప్రిల్ 14: హిందూ ధర్మ విశిష్టతను వ్యాప్తి చేసిన శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ ఆదిశంకరాచార్యులు జగద్గురువులుగా ప్రసిద్ధి చెందారని, వారి తరువాత సమాజంలో గురువు స్థానం పొందగలిగిన అర్హత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు ఉందని టిటిడి జెఈఓ(ఆరోగ్యం, విద్య) శ్రీమతి సదా భార్గవి అన్నారు. డా|| బి.ఆర్‌.అంబేద్కర్ 131వ జ‌యంతి ఉత్సవం తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో గురువారం ఘ‌నంగా జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిడి జెఈవో మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల వారి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. మహిళలను ప్రోత్సహిస్తే దేశాన్ని సైతం పాలించగలరు అని అంబేద్కర్ నమ్మారని, ఆయన ఆశయాల మేరకు నేడు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్నారని అన్నారు. ఇలాంటి మహానుభావులకు మరణం లేదని, వారిచ్చిన సందేశాల రూపంలో ఎల్లప్పుడూ జీవించే ఉంటారని చెప్పారు. అంబేద్కర్ ని చదివితే జ్ఞానం వస్తుందని, యుక్తితో పోరాడాలని ఆయన సూచించారని తెలిపారు. టిటిడి ఉద్యోగులను తాను కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్నానని, అందరూ సమష్టిగా కృషి చేసి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకాలని ఈ సందర్భంగా జెఈఓ ఆకాంక్షించారు. అనంతరం శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే… సంకీర్తన వినిపించి మనుషులందరూ ఒక్కటేనని తెలియజేశారు.

ఎస్వీయు తెలుగు విభాగాధిపతి ఆచార్య మేడిపల్లి రవికుమార్ మాట్లాడుతూ, ఇలాంటి జయంతి కార్యక్రమాల సందర్భంగా అంబేద్కర్ ఆలోచనలు ప్రస్తుత సమాజానికి ఎంత వరకు చేరాయి, ఎంత మేరకు కార్యరూపం దాల్చాయి అనే విషయాలను చర్చించుకోవాలన్నారు. అంబేద్కర్ పుట్టిన తరువాత కాలాన్ని అంతకుముందు కాలాన్ని స్పష్టంగా విభజించేలా సమాజంలో మార్పు కలిగిందన్నారు. నిమ్నకులాలకు సమాజంలో సముచిత స్థానం లభించిందన్నారు. పేద వారిలోనూ సామాజిక అంతరాలు ఉన్నాయని, అంబేద్కర్ ను అర్థం చేసుకుంటే అవి తొలగిపోతాయని చెప్పారు. ప్రస్తుత స్త్రీ, దళిత, మైనారిటీ, బిసి, ఎస్టి వాదాల వెనక అంబేద్కర్ ఉన్నారని తెలియజేశారు. అంబేద్కర్ ఆలోచనలు అలవర్చుకుంటే ప్రతి ఒక్కరి జీవితం సక్రమమార్గంలో నడుస్తుందన్నారు

అంబేద్కర్ ధర్మ పోరాట సమితి నేత శ్రీమతి పద్మజ మాట్లాడుతూ అంబేద్కర్ ని ప్రపంచ మేధావిగా అభివర్ణించారు. మన కష్టాలను తీర్చుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి అంబేద్కర్ వాదాన్ని అర్థం చేసుకోవాలన్నారు. ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొని మనకు గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించారని తెలియజేశారు. గౌతమ బుద్ధుడు, కబీర్, మహాత్మ జ్యోతిరావు పూలేని ఆయన గురువులుగా భావించారని, ఆత్మాభిమానం, శీలం, జ్ఞానం ఈ మూడు విషయాలను ఆరాధించారని తెలియజేశారు. అనంతరం పలువురు ఉద్యోగులు అంబేద్కర్ జీవిత విశేషాలను తెలియజేశారు.

అంతకుముందు అతిథులు శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించి, డా|| బి.ఆర్‌.అంబేద్కర్ చిత్ర‌పటానికి పుష్పాంజలి ఘటించారు. కార్య‌క్ర‌మం అనంత‌రం ప‌లువురు ఉద్యోగుల‌కు జ్ఞాపిక, వెండి డాలర్ అందజేశారు. వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన ఉద్యోగుల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓలు శ్రీ దామోదరం, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ దేవేంద్ర బాబు, శ్రీమతి జగదీశ్వరి, బిసి లైజ‌న్ అధికారి డాక్టర్ భ‌ర‌త్ కుమార్, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.