ALL SET FOR SITA RAMA KALYANAM-EO_ శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి – భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

VONTIMITTA, 14 APRIL 2022: TTD EO Dr KS Jawahar Reddy on Thursday said, the ancient place of Vontimitta which houses the famous shrine of Sri Kodanda Ramalayam is all set to celebrate the state festival of Sri Sita Rama Kalyanam on April 15.

After inspecting the arrangements for the celestial marriage along with the District Collector Sri Vijayarama Raju and JEO Sri Veerabrahmam, talking to media persons he said, the divine wedding ceremony will take place between 8pm and 10pm on Friday to which the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will take part in the big fete.

The EO also said as nearly 50-60 thousand devotees are expected to gather, the arrangements for the same are being carried out to ensure a hassle-free experience to devotees.

Earlier he also inspected the barricading, traffic regulation, galleries, talambralu, Annaprasadam, Security, water distribution and other arrangements and made some valuable advices to the officials concerned.

SP Sri Anburajan, CVSO Sri Narasimha Kishore, JC Sri Saikanth Verma, CE Sri Nageswara Rao and other district officials and TTD officials were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI 

శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి

– భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

ఒంటిమిట్ట‌, 2022 ఏప్రిల్ 14: ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 15వ తేదీ శుక్ర‌వారం శ్రీ సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని రామాలయం, కల్యాణవేదిక వద్ద జరుగుతున్న పనులను గురువారం ఈవో, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ విజ‌య‌రామ‌రాజు, ఎస్పీ శ్రీ అన్భురాజన్ తో క‌లిసి ప‌రిశీలించారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడారు, శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్ర‌భుత్వం తరపున సాంప్ర‌దాయ బ‌ద్ధంగా ముత్యాల త‌లంబ్రాలను ముఖ్య‌మంత్రి శ్రీ వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి స‌మ‌ర్పించ‌నున్న‌ట్లు తెలిపారు. వైఎస్ఆర్‌ జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్పీల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో టిటిడిలోని అన్ని విభాగాల స‌మ‌న్వ‌యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివ‌రించారు.

శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల కోసం సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. శోభాయ‌మానంగా క‌ల్యాణ‌వేదిక తీర్చిదిద్దుతున్నామ‌న్నారు. లక్ష మందికి పైగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండటంతో రాజీకి తావు లేకుండా ఏర్పాట్లు చేసిన‌ట్లు చెప్పారు. భ‌క్తులంద‌రికీ అక్షింతలు, అన్న‌ప్ర‌సాదాలు, తాగునీరు, మ‌జ్జిగ పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. టిటిడి, జిల్లా యంత్రాగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని పటిష్టమైన క్యూలైన్లు, బారికేడ్లు, పార్కింగ్‌, బందో బస్తు ఏర్పాటు చేస్తున్నార‌ని వివ‌రించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తుల‌కు కోసం శ్రీ సీతారాముల క‌ల్యాణాన్ని ఎస్వీబిసి ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు. ఆర్‌టిసివారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఒంటిమిట్ట‌కు బ‌స్సులు ఏర్పాటు చేశార‌ని చెప్పారు. క‌ల్యాణం త‌ర్వాత భ‌క్తులు తిరిగి వెళ్లేందుకు ఆర్టీసీ అద‌న‌పు బ‌స్సు స‌ర్వీసులను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

అంత‌కుముందు ఈవో క‌ల్యాణ వేదిక ప‌రిస‌రాలు, ప్ర‌వేశ మార్గాల‌ను ప‌రిశీలించి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీ సాయి క్రాంత్ వ‌ర్మ‌, సిఇవో ఏయం శ్రీ‌మ‌తి గౌత‌మి, టిటిడి జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్‌, సిఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, డెప్యూటీ ఈవోశ్రీ ర‌మ‌ణ‌కుమార్‌, విజివో శ్రీ మ‌నోహ‌ర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.