AMMAVARU AS DURBAR KRISHNA _ చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు

TIRUPATI, 23 FEBRUARY 2025: Sri Padmavati Ammavaru as Durbar Krishna impresses devotees on Chandraprabha Vahanam on the pleasant evening on Sunday.

The ongoing annual fest at Chennai Sri Padmavati Ammavaru temple witnessed the Goddess in all Her celestial pride as Durbar Krishna.

AEO Sri Parthasaradhi and other temple staff were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారు

చెన్నై / తిరుపతి, 2025 ఫిబ్రవరి 23: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి 7 గంట‌లకు అమ్మ‌వారు చంద్రప్రభ వాహ‌నంపై ద‌ర్బార్ కృష్ణుడి అలంక‌ర‌ణ‌లో భ‌క్తుల‌ను అనుగ్ర‌హించారు.

క్షీరసాగరంలో ఉద్భవించిన లక్ష్మికి చంద్రుడు సోదరుడు. పదహారు కళలతో ప్రకాశించే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న లక్ష్మీ శ్రీనివాసులపై దేవతలు పుష్పవృష్టి కురిపిస్తారని శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వర్ణించారు. అటువంటి చంద్రప్రభ వాహనంపై విహరించే తనను సేవించే భక్తులపై ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు పుష్పవృష్టిలాగా వర్షిస్తాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ పార్థ‌సార‌ధి, సూపరింటెండెంట్ శ్రీమ‌తి పుష్ప‌ల‌త‌, ఆల‌య అర్చ‌కులు ఇత‌ర అదికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.