ANJANADRI IS ANJANEYA SWAMY’S BIRTHPLACE WHICH IS AN INTEGRAL PART OF TIRUMALA- SCHOLARS _ నిస్సందేహంగా అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం

Tirumala, 31 July 2021: The Anjanadri Hills located in the Seshachala ranges is the Birthplace of Sri Anjaneya Swamy which is strongly proven through available evidence from Puranas, Sastras and Epigraphies asserted the scholars.

The two -day international Webinar on Anjanadri Tirumala-Anjaneya Birthplace organised jointly by Sri Venkateswara Institute of Higher Vedic Studies and National Sanskrit University concluded at Ramaranjan Mukherjee Hall in Varsity on Saturday.

Many Seers, versatile scholars, pundits, experts participated in this webinar and established their viewpoints affirming univocally that Anjanadri Tirumala is the birthplace of Anjaneya Swamy.

Acharya Chakravarti Ranganathan of National Sanskrit University emphasised that the Vaishnava literature of Alwar pasuras clearly indicated that the Anjanadri hillocks in Tirumala as the birthplace of Anjaneya Swami. He said even a stone inscription at Sri Ranganatha Swamy temple at Srirangam hailed Anjanadri as the birthplace of Hanuman.

Acharya Sri Rani Sadasiva Murthy of National Sanskrit University said Anjanadri was quoted extensively in Padma, Skanda and Brahmananda puranas. He also made a PowerPoint presentation on the scientific and geographic route taken by Sri Rama from Ayodhya to Sri Lanka.

Sri Archakam Ramakrishna Dikshitulu of Srivari temple spoke on the Significance of Anjanadri in Sapthagiri and said that the Tiruppavada Seva performed at Srivari temple on every Thursday by rendering Srinivasa Gadyam and Alavatta ritual spoke about the significance of Anjanadri.

Earlier IT exponent from California Sri Paladugu Sri Charan expressing his views on “Hanumanta in Sanskrit literature “ said Tirumala and Anjanadri are extensively quoted from Rig Veda to contemporary literature and displayed prevalent literary word banks as evidence.

While in the afternoon session, renowned spiritual scholars Sri Surendranath, Sri Vanam Jwala Narasimha Rao, Sri Unnikrishnan of Sanskrit College in Kerala, Sri Ramabhadracharji of Madhya Pradesh, Sri Madabhushi Sridhar, Sri Sankaranarayana ascertained the findings by Pundita Parishad of TTD on Anjanadri Tirumala as Anjaneya Swamy’s birthplace and appreciated the untiring efforts of TTD mandarins behind this divine task.

In the valedictory session, addressing the webinar, TTD Additional EO Sri AV Dharma Reddy said, he strongly believes that the whole idea of declaring Anjanadri Tirumala as the birthplace of Sri Anjaneya emerged only by the wish of Sri Venkateswara Swamy alone. “As soon as Ayodhya Ramajanmabhoomi was declared as birthplace of Sri Rama, our learned Executive Officer Dr KS Jawahar Reddy received many e-mails and WhatsApp messages from pilgrims across the country that TTD should take interests and put efforts to declare birthplace of Anjaneya Swamy, the ardent servant of Sri Rama. With this idea, the Pundita Parishad was set up with scholarly persons under the supremo of Sri Muralidhara Sharma, the VC of National Sanskrit University. After four months of vigorous research and day and night exercise by this team of pundits, we have brought out a synopsis with all epigraphically, puranic, geological evidences and declared Anjanadri as the birthplace of Anjaneya on the auspicious day of Sri Rama Navami on April 21 this year. We have also invited people who differed on this and also requested them to produce enough evidence proving their point. But so far a couple of persons who contradicted our statement could not prove their point. So we have declared Anjanadri as the birthplace of Anjaneya and soon will bring out a detailed book on the same”, he asserted with confidence.

Acharya V Muralidhar Sharma, Vice-chancellor of National Sanskrit University, SV Higher Vedic Studies Special Officer Dr A Vibhishana Sharma and TTD Pundit Parishad and other Vedic exponents were present in the two-day webinar.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

నిస్సందేహంగా అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం
– టీటీడీ కంటే ముందే ఎందరో ఈ విషయం పేర్కొన్నారు
– పురాణాల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వారెవరూ దీన్ని ఖండించలేరు
– ముగిసిన ఆంజనేయుని జన్మస్థలం అంజనాద్రి వెబినార్

తిరుమల, 2021 జూలై 31: పురాణాలు, శాసనాలు, భౌగోళిక ఆధారాలన్నీ తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని స్పష్టంగా చెబుతున్నాయి. ఇక ఇందులో ఆలోచించాల్సిందేమీ లేదని పలువురు పీఠాధిపతులు,పండితులు, చారిత్రక పరిశోధకులు తేల్చిచెప్పారు. టిటిడి
శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో హనుమంతుని జన్మస్థలం అంజనాద్రి అనే అంశంపై నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ వెబినార్ శ‌నివారం సాయంత్రం ముగిసింది. దేశంలోని నలుమూలలతో పాటు అమెరికా నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు, పురాణ, ఇతిహాస, భౌగోళిక పరిశోధనల్లో నిష్ణాతులు పాల్గొన్నారు.

తిరుమ‌ల క్షేత్రంలో అంతర్భాగమైన అంజనాద్రి పర్వతమే ఆంజనేయ స్వామి వారి జన్మస్థలమని, ఆళ్వారుల పాశురాలలోని వైష్ణ‌వ సాహిత్యం ద్వారా తెలుస్తోందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ చ‌క్ర‌వ‌ర్తి రంగ‌నాథ‌న్ తెలిపారు. “వైష్ణ‌వ సాహిత్యంలో తిరుమ‌ల‌-అంజ‌నాద్రి ” అనే అంశంపై మాట్లాడుతూ భ‌గ‌వంతుని అనుగ్ర‌హంతో జ‌న్మించిన ఆళ్వారులు భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌ను న‌లుదిశల వ్యాపింప చేశార‌ని చెప్పారు. వారు ర‌చించిన 4 వేల పాశురాల‌లో 207 పాశురాలు తిరుమ‌ల క్షేత్ర వైభ‌వాన్ని, అందులో 12 పాశురాలు విశేషంగా ఆంజ‌నేయ‌స్వామివారి గురించి తెలుపుతున్నాయన్నారు.

పండిత పరిషత్ కార్యదర్శి డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ ” భ‌క్తి కీర్త‌న‌ల‌లో అంజ‌నాద్రి ” అనే అంశంపై ప్ర‌సంగించారు. భ‌గ‌వ‌త్ సాక్షాత్కారం క‌లిగిన శ్రీ తాళ్ళ‌పాక అన్న‌మ‌య్య‌, శ్రీ పురంద‌ర దాసులు, శ్రీ వెంగ‌మాంబ లాంటి ప్ర‌ముఖ వాగ్గేయ‌కారులు అంజ‌నాద్రి ప‌ర్వ‌తం గురించి త‌మ కీర్త‌న‌ల‌లో ప్రస్తావించార‌న్నారు. శ్రీ రంగంలోని రంగ‌నాథ స్వామి ఆల‌యంలో ఉన్న శాస‌నం ద్వారా శేషాచల‌మే ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని తెలుస్తోందన్నారు.

జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయం ఆచార్య‌లు శ్రీ రాణి స‌దాశివ‌మూర్తి ” పురాణ భూగోళంలో హ‌నుమంతుడు – అంజ‌నాద్రి ” అనే అంశంపై ఉప‌న్యాసిస్తూ అంజ‌నాద్రి దాస క్షేత్ర‌మ‌ని, వేంక‌టాచ‌ల మ‌హాత్యం అనేది వివిధ‌ పురాణాల సంకలనమని చెప్పారు. కృత యుగంలో వృషాద్రి, త్రేతాయుగంలో అంజనాద్రి, కలియుగంలో వెంకటాచలంగా పిలవబడుతోందని చెప్పారు. ప‌ద్మ‌, స్కంద‌, బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఉందన్నారు. శ్రీ రామ‌చంద్ర‌మూర్తి ఆయోధ్య నుండి శ్రీ‌లంక‌కు ప్ర‌యాణించిన మార్గాన్ని వైజ్ఞానికంగా అక్షాంశాలు, రేఖాంశాల‌తో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు.

శ్రీ‌వారి ఆల‌య అర్చ‌కులు శ్రీ అర్చ‌కం రామ‌కృష్ణ దీక్షితులు ” స‌ప్త‌గిరుల‌లో అంజ‌నాద్రి ప్రాముఖ్యం ” అనే అంశంపై మాట్లాడుతూ శ్రీ‌వారికి నిత్యం జ‌రిగే కైంక‌ర్యాలు, హోమాలు, క్ర‌తువుల్లో చ‌తుర్ణామాల‌తో అర్చ‌న చేస్తార‌న్నారు. త్రేతాయుగంలో తిరుమ‌ల ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌లంగా ప్ర‌సిద్ధికెక్కింద‌న్నారు. ప్ర‌తి గురువారం నిర్వ‌హించే తిరుప్పావ‌డ సేవ‌లో పఠించే శ్రీ‌నివాస గ‌ద్యం, ఆల‌వ‌ట్ట కైంక‌ర్యంలో అంజ‌నాద్రి ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు.

కాలిఫోర్నియా నుండి ప్ర‌ముఖ ఐటి నిపుణులు శ్రీ పాల‌డుగు
శ్రీ చ‌ర‌ణ్ ” సంస్కృత సాహిత్యంలో హ‌నుమంతుడు – (ఋగ్వేదం నుండి స్తోత్ర‌ముల వ‌ర‌కు ) ” అనే అంశంపై వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌సంగించారు. ఋగ్వేదం నుండి వ‌ర్త‌మాన సాహిత్యం వ‌ర‌కు అన్ని ప‌దాల్లో తిరుమ‌ల అంజ‌నాద్రి అని నిరూపించ‌బ‌డింద‌న్నారు. దానికి సాహిత్య ఆధారాలు ఉన్న‌ట్లు వివ‌రించారు.

మధ్య ప్రదేశ్ చిత్రకూట్ లోని రామభద్రాచార్య ప్రత్యేక ప్రతిభావంతుల విశ్వవిద్యాలయం కులపతి శ్రీశ్రీశ్రీ జగద్గురు రామభద్రాచార్య అనుగ్రహ భాషణం చేశారు. గోవింద రాజీయంలో తిరుమల అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలమని స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో రెండో ఆలోచనే అవసరం లేదన్నారు.

తిరువనంతపురం లోని ప్రభుత్వ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. ఉన్ని కృష్ణన్ మాట్లాడుతూ, తిరుమలలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయునికి జన్మ ఇచ్చినందువల్లే ఆ కొండకు అంజనాద్రి అని పేరొచ్చిందని చెప్పారు. ఇందుకు తగిన పురాణ ఆధారాలను ఆయన వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ప్రజాసంబంధాల అధికారి శ్రీ వనం జ్వాలా నరసింహారావు, ముంబైకి చెందిన ప్రసిద్ధ కవి, ఆధ్యాత్మిక వేత్త శ్రీ సాంపతి సురేంద్ర నాథ్ మాట్లాడారు.

కర్నాటక రాష్ట్రం సోసలే లోని వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యా శ్రీశతీర్థ మహాస్వామి అనుగ్రహ భాషణం చేశారు.

టీటీడీ అదనపు ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, జాతీయ సంసృత విశ్వవిద్యాలయం ఉప కులపతి, టిటిడి పండిత పరిషత్ అధ్యక్షులు ఆచార్య వి.మురళీధర్ శర్మ, మాడభూషి శ్రీధర్, శ్రీ జాదవ్ విజయ కుమార్ తో పాటు పలువురు పండితులు, ఆచార్యులు వెబినార్‌లో పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.