ANKURARPANA HELD _ అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUPATI, 09 JUNE 2022: As the annual Brahmotsavams in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta are scheduled from June 10-18, Ankurarpanam was performed on Thursday evening.

On June 10, Dhwajarohanam will be observed between 10am and 10:20am in the auspicious Karkataka Lagnam.

Deputy EO Sri Lokanatham, Superintendent Smt Srivani, Kankanabhattar Sri Suryakumaracharyulu, temple inspector Sri Siva Kumar were also present.

 ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో బ్ర‌హ్మోత్స‌వాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2022 జూన్ 09: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు ఈ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ముందుగా మేదినిపూజ చేప‌ట్టారు. ఆ త‌రువాత సేనాధిపతి ఉత్సవం నిర్వ‌హించారు. ఈ ఉత్స‌వం ద్వారా శ్రీ విష్వ‌క్సేనుల‌వారు నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని ప్ర‌తీతి. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణం నిర్వహించారు.

జూన్ 10న ధ్వజారోహణం :

జూన్ 10వ తేదీ శుక్ర‌వారం ఉదయం 10 నుంచి 10.20 గంటల మ‌ధ్య క‌ర్కాట‌క ల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 13వ తేదీ సాయంత్రం 5 నుండి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, ఏఈఓ శ్రీ ప్రభాకర్ రెడ్డి, కంకణభట్టార్ శ్రీ సూర్య‌కుమారాచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ‌మ‌తి శ్రీ‌వాణి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ శివ‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.