ANKURARPANAM AT SRI PAT FOR PAVITHROTSAVAM_ ఘ‌నంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Tiruchanoor, 11 Sep. 19: The auspicious ritual of Ankurarpanam was performed on Wednesday evening for the annual festival of Pavitrotsavam at Sri Padmavathi Ammavari temple.

Interested devotees could participate with ₹750 ticket each on which two persons will be allowed during these three days and beget 2 Laddu, 2 vadas as prasadam.

TTD has cancelled all arjita sevas in the Tiruchanoor temple from Wednesday to facilitate the Pavitrotsavam event.

DyEO Smt Jhansi Rani, Agama advisor Sri Srinivasacharyulu, AEO Sri Subramanyam Superintendent Smt Malleswari and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఘ‌నంగా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ

తిరుప‌తి, 2019 సెప్టెంబరు 11: తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు బుధ‌వారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఆల‌యంలో సెప్టెంబరు 12 నుండి 14వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, పవిత్ర అధివశం నిర్వహిస్తారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నం రద్దయ్యాయి.

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సెప్టెంబరు 12వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 13న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 14న మ‌హాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఆర్జిత సేవ‌లు ర‌ద్దు :

సెప్టెంబరు 11న అంకురార్పణం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రేక్‌ దర్శనాలను రద్దు చేశారు. సెప్టెంబరు 12న గురువారం తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 13న శుక్రవారం అభిషేకానంతర దర్శనం, ఉదయం బ్రేక్‌ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 14న శనివారం ఉదయం బ్రేక్‌ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమసలహాదారు శ్రీశ్రీనివాసాచార్యులు, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ మల్లీశ్వరి, అర్చకుడు శ్రీపిపిఎస్‌.ప్రతాప్‌, ఆర్జితం ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కోలా శ్రీను ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.