PAVITROTSAVAM ENDS IN SRI GT_ పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

Tirupati, 11 Sep. 19: The holy annual ritual of Pavitrotsavam concluded at Sri Govindarajaswamy temple with Purnahuti on Wednesday evening.

Both Tirumala Jeeyar Swamis, Special grade DyEO Smt Varalakshmi AEO Sri Ravi Kumar Reddy, temple inspector Sri Krishna Murthy and others participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ‌ గోవిందరాజస్వామివారి ప‌విత్రోత్స‌వాలు

తిరుప‌తి, 2019 సెప్టెంబరు 11: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆల‌యంలో బుధ‌వారం రాత్రి పూర్ణాహుతితో ప‌విత్రోత్స‌వాలు ముగియ‌నున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఆ త‌రువాత‌ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం జరుగనుంది. ఆ త‌రువాత రాత్రి యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు, పూర్ణాహుతి, ప్ర‌బంధ శాత్తుమొర‌, వేద శాత్తుమొర నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఉత్స‌వ‌మూర్తులు కుంభం విమాన‌ప్ర‌ద‌క్షిణంగా స‌న్నిధికి వేంచేపు చేస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌ స్వామి, ఆలయ ప్ర‌త్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి వ‌ర‌ల‌క్ష్మి, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి ఇత‌ర అధికారులు, భ‌క్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.