ANKURARPANAM DONE FOR PUSHPA YAGAM AT SRI GT_ శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

Tirupati, 7 Jul. 19: The holy ritual senadhipati utsavam ahead of Ankurarpanam as part of Pushpa yagam event slated for July 8 was performed at Sri Govindaraja Swamy temple on Sunday evening. The traditional Veedhi utsava was also conducted later on.

On Monday morning snapana thirumanjanam will be performed and later Pushpa yagam will commence with a variety of flowers and aromatic leaves. Interested devotees could participate in Pushpa yagam by payment of Rs.516 and beget blessings and some special Prasadams.

Special grade DyEO Smt Varalakshmi, AEO Sri Ravi Prakash Reddy, Superintendent Sri Jnana Prakash, Temple inspector Sri Krishna Murthy and other officials participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

జూలై 07, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 8వ తేదీ సోమ‌వారం జ‌రుగ‌నున్న‌ పుష్పయాగానికి ఆదివారం శాస్ర్తోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ముందుగా సేనాధిప‌తి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా శ్రీ విష్వ‌క్సేనులవారు ఆల‌య మాడ వీధుల్లో విహ‌రించారు. ఆ త‌రువాత అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.

సోమ‌వారం ఉదయం 9.30 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు వీధి ఉత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.516/- టికెట్‌ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చు.

ఈ ఆల‌యంలో మే 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ ర‌విప్ర‌కాష్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ జ్ఞాన‌ప్ర‌కాష్‌, ఆలయ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీ కృష్ణ‌మూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.