KALYANA VENKANNA RIDES HANUMANTHA VAHANAM_ హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
Srinivasa Mangapuram, 07 July 2019 : On the evening Day-2 of ongoing annual Sakshatkara Vaibhaotsavam at Sri Kalyana Venkateswara temple of Srinivasa Mangapuram Lord rode on Hanumanta Vahanam and blessed devotees.
After morning daily rituals, the utsava idols of Swami and his consorts were rendered grand snapana thirumanjanam.
In the evening the TTD organized colorful unjal seva and Hanumanta vahanam procession at night on Mada streets to bless the devotees.
DyEO Sri Dhananjayulu, AEO Sri D Lakshmaiah, Temple inspector Sri Anil Kumar, Temple archakas, officials and devotees participated.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
హనుమంత వాహనంపై శ్రీ కల్యాణ వెంకన్న అభయం
ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు
జూలై 07, తిరుపతి, 2019: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమివ్వనున్నారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.
అనంతరం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవ జరుగనుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జూలై 8న గరుడ వాహనసేవ జరుగనుంది.
హనుమంత వాహనంపై విహారం
సాక్షాత్కార వైభవోత్సవాల్లో రెండో రోజు రాత్రి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు హనుమంత వాహనంపై మాడ వీధులలో భక్తులకు అభయమిచ్చారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్రగణ్యుడైన హనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు ప్రాచీన వాఙ్మయం నుండి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాదిస్తున్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో హనుమద్వాహన సేవను సిరియ తిరువడిగా కీర్తిస్తారు. కావున దాసభక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ కె.ధనంజయుడు, ఏఈవో శ్రీ డి.లక్ష్మయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి.అనిల్‌కుమార్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.