ANKURARPANAM HELD FOR KOTI MAHA PUSHPA YAGAM _ క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

TIRUCHANOOR, 15 JULY 2021: The Beejavapanam fete otherwise known as Ankurarpanam was held in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Thursday evening in connection with the unique nine day fete, Kanakambara Sahita Koti Mallepushpa Maha Yagam which commences on Friday.

Usually, Ankurarpanam is a traditional festival of prelude that is performed before commencing any religious event seeking the divine intervention towards the successful completion of the ritual yielding fruitful results to mankind.

This religious fete took place in the temple between 6pm and 8pm with a series of events like Vishwaksena Aradhana, Punyahavachanam, Raksha Bandhanam, Anugna and finally Beejavapanam was performed by Ritwiks amidst chanting of Veda mantras.

Due to Covid restrictions, the event took place in Ekantam. Temple DyEO Smt Kasturi Bai and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగానికి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌

తిరుపతి, 2021 జులై 15: తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో జులై 16 నుండి 24వ తేదీ వ‌రకు ఆన్‌లైన్ వ‌ర్చువ‌ల్ విధానంలో జ‌రుగ‌నున్న క‌న‌కాంబ‌ర స‌హిత కోటి మ‌ల్లెపుష్ప మ‌హాయాగానికి గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. కోవిడ్‌-19 కార‌ణంగా ప్ర‌పంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని శ్రీ మ‌హాల‌క్ష్మి అవ‌తార‌మైన శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి ఈ మ‌హాయాగం నిర్వ‌హిస్తోంది.

అంకురార్ప‌ణ సంద‌ర్భంగా సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌రకు విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, ర‌క్షాబంధ‌నం, అనుజ్ఞ‌, అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

భ‌క్తుల‌కు అందుబాటులో వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లు

వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గొనాల‌నుకునే గృహ‌స్తుల కోసం టిటిడి ఆన్‌లైన్‌లో ఈ టికెట్ల‌ను అందుబాటులో ఉంచింది. https://tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా గృహ‌స్తులు(ఇద్ద‌రు) రూ.1001/- చెల్లించి టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. ప్ర‌తిరోజూ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు ఈ మ‌హాయాగాన్ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. ఈ యాగం జ‌రిగే 9 రోజుల పాటు ఆల‌యంలోని శ్రీ‌కృష్ణ ముఖ మండ‌పంలో ఉద‌యం, సాయంత్రం వేళ‌ల్లో అర్చ‌న‌లు, ల‌ఘుపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు. చివ‌రిరోజు జులై 24న ఉద‌యం 10.30 నుండి 11 గంటల వ‌ర‌కు మ‌హాప్రాయ‌శ్చిత్త హోమం, ఉద‌యం 11 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు మ‌హాపూర్ణాహుతి నిర్వ‌హిస్తారు.

భ‌క్తులు త‌మ ఇళ్ల నుండి టీవీల ద్వారా వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ యాగంలో పాల్గొన‌వ‌చ్చు. వ‌ర్చువ‌ల్ విధానంలో మ‌హాయాగంలో పాల్గొనే గృహ‌స్తులు 90 రోజుల్లోపు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని రూ.100/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క్యూలైన్ ద్వారా ఉచితంగా ద‌ర్శించుకోవ‌చ్చు. ద‌ర్శ‌నానంత‌రం గృహ‌స్తుల‌కు ఒక ఉత్త‌రీయం, ఒక ర‌వికె, అమ్మ‌వారి అక్షింత‌లు అంద‌జేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి బాయి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణారెడ్డి టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.