ANNUAL SAKSHATKARA VAIBHAVAM CONCLUDES IN SKVST _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ కల్యాణ వెంకన్న క‌టాక్షం

TIRUPATI, 15 JULY 2021: The annual Sakshatkara Vaibhavam at Sri Kalyana Venkateswara Swamy temple in Srinivasa Mangapuram concluded on a grand note on Thursday evening with Garuda Vahana Seva.

Earlier in the morning, Snapana Tirumanjanam was performed to the deities on this occasion. This ritual took place in the Mukha Mandapam located in the temple premises between 10am and 11am.

Later in the evening, the processional deity of Sri Kalyana Venkateswara Swamy was seated on Garuda Vahana and the event observed in Ekantam due to Covid restrictions.

Temple DyEO Smt Shanti, Temple Suptd Sri Chengalrayulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గ‌రుడ వాహ‌నంపై శ్రీ కల్యాణ వెంకన్న క‌టాక్షం

ముగిసిన సాక్షాత్కార వైభవోత్సవం

తిరుపతి, 2021 జులై 15: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవంలో చివ‌రి రోజైన గురువారం రాత్రి స్వామివారిని విశేషమైన గ‌రుడ వాహ‌నంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు గ‌రుడ వాహనంపై స్వామివారిని కొలువుదీర్చి ఆస్థానం చేప‌ట్టారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌య‌, సూప‌రింటెండెంట్లు శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ చెంగ‌ల్రాయ‌లు, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ యోగానంద‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.