ANKURARPANAM HELD IN SKVST _ శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

TIRUPATI, 10 FEBRUARY 2023: Ankurarpanam fete prior to flagging of annual brahmotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram was held on Friday.

As part of it, Punyahavachanam, Mritsangrahanam, and Senadhipathi Utsavam were performed.

Dhwajarohanam will be observed between 8:40 am and 9 am in the auspicious Meena Lagnam on February 11.

Special Gr. DyEO Smt Varalakshmi, AEO Sri Gurumurty, Superintendent Sri Chengalrayalu, Temple Inspector Sri Kiran Kumar Reddy, and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శాస్త్రోక్తంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

 తిరుపతి, 2023 ఫిబ్రవరి 10 శ్రీనివాసమంగాపురం ;శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.

అంకురార్పణం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, కొలువు, పంచాంగ శ్రవణం, మూల వర్లకు అభిషేకం నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్‌ శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్‌ రెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 11న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 11వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య మీన‌ల‌గ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జరుగనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ               ఉదయం              సాయంత్రం

11-02-2023           

ధ్వజారోహణం                          పెద్దశేష వాహనం

12-02-2023         

చిన్నశేష వాహనం                    హంస వాహనం

13-02-2023           

సింహ వాహనం                        ముత్యపుపందిరి వాహనం

14-02-2023           

కల్పవృక్ష వాహనం               సర్వభూపాల వాహనం

15-02-2023         

 పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం)   గరుడ వాహనం

16-02-2023           

హనుమంత వాహనం స్వర్ణరథం,    గజ వాహనం

17-02-2023           

సూర్యప్రభ వాహనం                       చంద్రప్రభ వాహనం

18-02-2023           

రథోత్సవం                                       అశ్వవాహనం

19-02-2023             

చక్రస్నానం                                    ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.